బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్ ఎన్నో అరాచకాలు చేశారని ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు ఆయన పై మండిపడ్డ సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా ఓ కాంగ్రెస్ నేత అయితే కేటీఆర్ పర్సన్ లైఫ్ ని వివాదంలోకి లాగుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఇప్పటికే పలుమార్లు ఆయన పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత గజ్జల కాంతం మరోసారి ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గజ్జల కాంతం తాజాగా ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. కేటీఆర్ బాగోతాలన్ని నాకు తెలుసు. ఈ విషయాలన్నీ బయటపడకూడదని ఆయన దుబాయిలో నా బినామీని చంపితే ప్రూఫ్స్ అన్నీ పోతాయి అనుకున్నారు.కానీ ఆ ప్రూఫ్స్ అన్ని నా దగ్గరే ఉన్నాయి.

 2022లో ఓ హీరోయిన్ కి జ్యువెల్లరీ షాప్ యజమాని ఖాతా నుండి 100 కోట్లు పంపించాడు.ఈ 100 కోట్లు ఎక్కడివి ఆ హీరోయిన్ కి 100 కోట్లు ఎందుకు పంపించాడు. ఆ హీరోయిన్ తో ఉన్న సంబంధం ఏంటి.. ఢిల్లీలో ఉండే లలిత్ హోటల్ రూమ్ నెంబర్ 770లో ఓ హీరోయిన్ ని పిలిపించుకున్నాడు. ఆ హీరోయిన్ ఒప్పుకోకపోవడంతో 50 కోట్లు ఇస్తానని బెదిరించి బలవంతం చేశాడు. అలాగే మహారాష్ట్రలోని తాజ్ కృష్ణ హోటల్ రూమ్ నెంబర్ 328 కి మరో హీరోయిన్ ని పిలిపించుకొని 75 లక్షలతో ఓ విల్లా, 35 కోట్లు, ఓ ఆడి కారు గిఫ్టుగా ఇచ్చి సెటిల్ చేశాడు. ఈ విషయాలన్నీ నాకు తెలుసు. కావాలంటే సిసి టీవి ఫుటేజ్ కూడా బయట పెడతాను.

 కేటీఆర్ కేసీఆర్ లకి విదేశాలలో ఎన్నో వ్యాపారాలు, పెట్టుబడులు పెట్టారు..కేసీఆర్ ఫ్యామిలీ దుబాయిలో ఓ వ్యాపారంలో 25వేల కోట్ల పెట్టుబడి,అమెరికాలోని ఓ వ్యాపారంలో 40 వేల కోట్ల పెట్టుబడి పెట్టారు. ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో 30 వేల ఎకరాలు దోచుకున్నారు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ అబద్ధం అయితే కేటీఆర్ తన కొడుకు పై ప్రమాణం చేసి ఈ విషయాలన్నీ అబద్ధాలు అని మీడియా ముఖంగా తెలపాలి అంటూ కాంగ్రెస్ నేత గజ్జల కాంతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు రాజకీయాల్లో దుమారం సృష్టిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: