సుమారుగా రూ.300 కోట్ల రూపాయలు బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి హీరో యష్ రూ. 50 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే హీరోయిన్ కీయారా అద్వానీ రూ 15 కోట్లు, నయనతార రూ.12 నుంచి రూ.18 కోట్లు, మరో హీరోయిన్ రుక్మిణి వసంత్ రూ. 3 కోట్లు, మొలిస్సా రూ.3 కోట్లకు పైగా, హుమా ఖురేషి, తార సుతారియా రూ.2 నుంచి రూ.3కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారు.
టాక్సీక్ టీజర్ విడుదలైన 24 గంటలలో సుమారుగా 200 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఇందులో యష్ రాము అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా ఈ ఏడాది మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా చిత్ర బృందం అఫీషియల్ గానే ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ , హిందీ తో పాటుగా ఇతర భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. కేజిఎఫ్ సినిమాలతో సరికొత్త రికార్డులను తిరగ రాసిన హీరో యష్ బాలీవుడ్ లో రామాయణం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తి అయిన తర్వాతే కే జి ఎఫ్ 3 పై ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి