విశాఖ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో కూటమి నేత బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ ఈ విధంగా మాట్లాడారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ విషయంలో కూటమికి మైలేజ్ వస్తుందని భావిస్తున్న తరుణంలో బిజెపి ఎమ్మెల్యే ఇలా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడంతో రాజకీయాలలో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్ పోర్ట్ కి చేరాలి అంటే సుమారుగా 2 గంటల పాటు సమయం పడుతుందని, ఎయిర్ పోర్ట్ కి వెళ్లేందుకు వేసే కనెక్టింగ్ రోడ్లు నిర్మాణం పూర్తి అవ్వడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుందని తెలిపారు బిజెపి ఎమ్మెల్యే.
అంత దూరం ప్రయాణించి విమానం ఎక్కడం కంటే రైలు ప్రయాణమే ఉత్తమం అంటూ తన అభిప్రాయంగా తెలియజేశారు. అంతేకాకుండా ఎంపీ భరత్ చొరవ తీసుకొని మరో రెండు వందే భారత్ రైళ్లను కేటాయించేలా చూడాలి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలు రోడ్ల నిర్మాణం పూర్తి కాకుండానే ఈ ఎయిర్ పోర్ట్ ని ప్రారంభిస్తే ప్రయాణికులు తిప్పలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి విశాఖ ఎయిర్ పోర్ట్ ను మూసివేయడం పై కూడా తాను వ్యతిరేకిస్తున్నానంటూ తెలిపారు విష్ణుకుమార్. ఈ విమానాశ్రయం ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంది, అందుకే యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.. ఒకవేళ ఈ ఎయిర్ పోర్ట్ ను మూసివేయాలని ఆలోచన వస్తే..అందుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిపించాలని తెలియజేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి