ఇప్పుడున్న సమాజంలో మనుషులను నమ్మలేము. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు.. ఎందుకు ఇలా అన్నాను అనుకుంటున్నారా..?    సడన్‌గా జాబ్ పొతే ఎం చేస్తారు.? ఎందుకు ఇలా అంటున్నాను అనుకుంటున్నారా..? నిజమేకదండి నేను చెప్పింది. ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా మన కాళ్ళ మీద మనం నిల్చోవాలి కదా..! ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. 

ఉద్యోగం పోయినప్పుడు వేరొక జాబ్ దొరకడానికి ఎంత టైమ్ పడుతుంతో కూడా చెప్పలేం. అయితే ఉద్యోగం పోయిందనేసి ఈఎంఐలు సహా, ఇతర ఆర్థిక వ్యవహారాలు ఆగవు. అందువల్ల వెంటనే ఏదో ఒక పని వెత్తుకోవడం మంచిది. అప్పుడు ఆర్థికంగా కొంత భారం తగ్గించుకోవచ్చు. ఉద్యోగం పోయి కొత్త జాబ్ దొరికేందుకు కొంత టైమ్ పట్టేలా ఉంటే.. అలాంటి సమయంలో ఏం చేయాలో చూద్దాం..

ఎమర్జెన్సీ ఫండ్ ఉండేలా చూసుకొని, ఆర్థిక వ్యవస్థ మందగమనం ఇప్పటికే పలు రంగాలపై ప్రభావం చూపుతోంది. జాబ్ మార్కెట్‌పై కూడా ఎఫెక్ట్ పడుతోంది. అందువల్ల 9 నెలల నుంచి ఏడాది వరకు ఇంటి ఖర్చుల కోసం సమానమైన మొత్తాన్ని అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోవడం మంచిది.
ఉద్యోగం పోయినప్పుడు మీ కంపెనీ అందించే ఇన్సూరెన్స్ పాలసీతో మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలాంటి సమయంలోనే మీ కుటుంబ సభ్యులకు ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడితే అప్పుడు మీ జేబుకు భారీగా చిల్లుపడే అవకాశముంది. అందువల్ల మీరు కంపెనీ పాలసీ కాకుండా సొంతంగా వేరొక పాలసీ కలిగి ఉండటం ఉత్తమం. జాబ్ పోయిన వెంటనే చేయాల్సిన పని అనవసర ఖర్చులు తగ్గించుకోవడం. కొత్త బడ్జెట్ క్రియేట్ చేసుకోవాలి. మీ సేవింగ్స్, చేతిలో డబ్బులు ప్రాతిపదికన ఖర్చులను నిర్దేశించుకోవాలి. ఇన్సూరెన్స్ ప్రీమియం, లోన్, ఈఎంఐ, యుటిలిటీ వ్యయాలు వంటి చెల్లింపులను మరిచిపోవద్దు. తొందరగా ఉద్యోగం పొందటానికి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి. షార్ట్ టర్మ్ కోర్సులు చేయండి.


రెగ్యులర్ ఇన్‌కమ్ లేనప్పుడు బ్యాంక్ ఈఎంఐలు కట్టడం భారం కావొచ్చు. అలాగే ఇన్సూరెన్స్ ప్రీమియం, మ్యూచువల్ ఫండ్ సిప్ వంటివి కూడా చెల్లించకపోకపోవచ్చు. అందువల్ల మీ బ్యాంక్‌కు వెళ్లి ఈఎంఐ హాలిడే లేదా ఈఎంఐ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: