ప్రస్తుతం ఆటో రంగంలో అత్యుత్తమ వాహనాలను అందిస్తున్న సంస్దలలో వోక్స్ వాగెన్ సంస్ద ఒకటి. ఎందుకంటే ఈ సంస్ద అందించే వాహనాలలో వారికంటూ ఓ ప్రత్యేకత.. అత్యాధునిక హంగులతో వాహనాలను రూపొందించి ప్రజలకు అందిస్తారు కాబట్టి ఈ వాహనాలు అంటే భారత్ లో చాలామంది వాహనదారులకు ఎంతో ఇష్టం. 

 

అలాంటి ఈ సంస్ద నుండి కొత్త రకం అయినా కార్లను భారత మార్కెట్లో మార్చ్ లో విడుదల చేస్తున్నారు. అయితే తాజాగా ఆ సంస్దకు సంబంధించిన సరికొత్త టైగ్వాన్ ఆల్ స్పేస్ మోడల్ ను లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.. ఈ కారును మార్చి 6న లాంచ్ చెయ్యాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. 

 

అయితే ఈ కారు ధరను ఇప్పటికి ప్రకటించినప్పటి మార్కెట్ నిపుణుల సమాచారం ప్రకారం ఈ కారు ధర 35 లక్షల రూపాయలుగా ఉండనుంది అని సమాచారం. అయితే వోక్స్ వాగెన్ టైగ్వాన్ ఆల్ స్పేస్ బుకింగ్ ఫీజు రూ. 50,000 అని ఆ సంస్ద ముంబై డీలర్లు ఖరారు చేశారు.. ఈ కారులో ఐదుగురు మాత్రమే కూర్చునే అవకాశం ఉంది. ఇంకా ఈ కారు కోసం వాహన ప్రియులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కారు మర్చి 6వ తేదీన లాంచ్ కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: