వాహనాలలో అతి సులువైన వాహనం అంటే అది ఒక్క స్కూటర్.. చూడటానికి చిన్నదిగా ఉన్నా దూరాలు వెళ్లడానికి అణకువగా ఉంటుంది. ఈ స్కూటర్ కంపెనీలు కూడా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని  కొత్త టెక్నాలజిలతో తయారు చేస్తున్నారు. ఇటీవల మార్కెట్ లోకి కొత్త రకం ఫీచర్లతో కూడిన స్కూటర్లు చాలానే వచ్చాయి. ఇప్పుడు మరో ఆకర్షణీయమైన స్కూటర్ మార్కెట్ లో సందడి చేస్తోంది. ప్రజలకు వీలుగా ఈ బండిని రూపొందించారు. ఆ బండి కంపెనీ ఎంటి? అందులో అంతగా ఆకట్టుకొనే అంశాలు ఏంటో చూద్దాం..




దసరా, దీపావళి పండుగలు వస్తే చాలు ఇక అన్నీ కంపెనీలు వస్తువుల కొనుగోలు పై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు ప్రయత్నిస్తారు. తాజాగా హీరో సంస్థ ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించే పనిలో పడింది.సరికొత్త కమర్షియల్ విద్యుత్ స్కూటర్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అదే హీరో ఎన్వైఎక్స్-హెచ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఎక్స్ షోరూంలో ఈ వాహనం వెల వచ్చి  రూ.64,640లుగా సంస్థ నిర్ణయించింది. ఈ స్కూటర్ ప్రత్యేకం ఎలెక్ట్రిక్ మోటార్ సహాయంతో పని చేస్తుంది.0.6 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ తో పాటు 1.53 కిలోవాట్ అవర్ సామర్థ్యం కలిగిన లిథియం అయాన్ బ్యాటరీ ను కూడా కలిగి ఉంటుంది.



ఈ స్కూటర్ ప్రత్యేకం ఏంటంటే ఒకసారి ఛార్జింగ్ పెడితే 82 నుంచి 210 కిలోమీటర్లు వరకు ప్రయాణిస్తుంది.. పది విభిన్న రకాల వ్యాపారాలకు అనువుగా ఉపయోగించుకోవచ్చు.. అంతేకాదు మొబైల్ కనెక్టివిటీ కూడా ఉందట..బ్లూటూత్ ఇంటర్ ఫేస్ హై ఎండ్ రిమోట్ సర్వీలెన్స్, డయాగ్నస్టిక్స్ లాంటి వాటితో ఉపయోగపడుతుంది.కాంబీ బ్రేకింగ్ సిస్టం, రీజనరేటివ్ బ్రేకింగ్ సెటప్, హెవీ లోడ్ లోనూ స్మూత్ రైడ్ సిస్టం లాంటి ప్రత్యేక సదుపాయాలు కూడా ఇందులో ఉన్నాయని అంటున్నారు.ప్రస్తుతం ఈ స్కూటర్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.అందుకు కారణం 210 కిలోమీటర్ల మైలేజి ఇవ్వటమే..ఇంక ఆలస్యమెందుకు తక్కువ ధరలో వస్తున్న ఈ స్కూటర్ ను కొనండి..


మరింత సమాచారం తెలుసుకోండి: