ఆటో మొబైల్ కంపెనీల హవా ఇప్పుడు జోరుగా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు కొత్త కార్లు మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి. పండగ సీజన్ లలో పోటీ పడుతున్నా ఆటో మొబైల్ కంపెనీలు అదిరిపోయే ఫీచర్ల తో పాటుగా కొత్త కార్లను మార్కెట్ లోకి విడుదల చేశారు. ఇకపోతే ఇప్పటి వరకు ఓ మాదిరిగా ఉన్న రేట్లు ఇప్పుడు భారీగా పెరగనున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ఇప్పటివరకు భారీ డిస్కౌంట్లు ప్రకటించిన కంపెనీలను చూస్తే.. మారుతి బాట లోనే ఫోర్డ్, కియా మోటార్స్ వంటి కంపెనీలు కూడా ప్రకటించాయి.. తాజాగా భారత దేశపు అతి పెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన హ్యుందాయ్ కార్లు కూడా కార్ల ఉత్పత్తి పెంచేందుకు కృషి చేస్తుంది. హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఇయర్ ఎండ్ సేల్ భాగంగా కొన్ని ఎంపిక చేసిన మోడల్ లపై శాంట్రో, గ్రాండ్ ఐ20, గ్రాండ్ ఐ20 నియోస్, ఔరా, ఎలంట్రా మోడల్ల పై ఆఫర్ లలో కస్టమర్ ఎంచుకునే మోడల్ని బట్టి కస్టమర్లకు గరిష్టంగా ఒకలక్ష వరకు విలువైన ప్రయోజనాలను అందిస్తుంది..


మరో ముఖ్యమైన ఆఫర్ ఏంటంటే ఈ కార్లకు దేశ వ్యాప్తంగా క్లీనింగ్ సర్వీస్ ను అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సర్వీస్ సెంటర్ కు తీసుకువచ్చే వాహనాల సర్వీస్, స్పేర్స్ పై ప్రత్యేక తగ్గింపు కూడా అందిస్తుంది. హ్యుందాయ్ ఐ20 ప్రీమియం హ్యాచ్బ్యాక్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. ఈ మార్కెట్లో విడుదలైన 40 రోజుల్లోనే 30వేల యూనిట్లకు పైగా బుకింగ్స్ దక్కించుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.. నూతన సంవత్సరం ఇకపోతే కొత్త సంవత్సరం లో ఈ కార్ల పై కొంత వరకు ధరలను పెంచాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. నాటికి సొనెట్, సెల్టోస్ మోడల్ ధరలు పెంచుతామని ప్రకటించింది. కార్నివాల్ మోడల్ పై ధర పెంచడం అనేది వెల్లడించలేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: