ఆ తర్వాత సాయి దుర్గ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘సుప్రీమ్’ సినిమాను డైరెక్ట్ చేశాడు. మాస్, కామెడీ, యాక్షన్‌ల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం మరో హిట్‌గా నిలిచింది. సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో కీలకమైన సినిమాల్లో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది. అనిల్ రావిపూడి కథనం, కామెడీ టైమింగ్ ఈ సినిమాతో మరింతగా ప్రశంసలు అందుకున్నాయి.ఇక వెంటనే మాస్ మహారాజ రవితేజతో కలిసి చేసిన ‘రాజా ది గ్రేట్’ సినిమా అనిల్ కెరీర్‌లో ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. రవితేజకు చాలా కాలం తర్వాత వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్‌గా ఈ సినిమా రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా అంధుడి పాత్రలో రవితేజ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాతో అనిల్ రావిపూడి మాస్ దర్శకుడిగా తన బ్రాండ్‌ను మరింత బలపర్చుకున్నాడు.తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తెరకెక్కించాడు అనిల్. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. మహేష్ బాబు కెరీర్‌లో అత్యంత ఎంటర్‌టైనింగ్ సినిమాల్లో ఒకటిగా ఇది నిలిచింది. కమర్షియల్ ఎలిమెంట్స్‌ను ఎంత బ్యాలెన్స్‌గా హ్యాండిల్ చేయాలో అనిల్ ఈ సినిమాతో మరోసారి చూపించాడు.
అలాగే విక్టరీ వెంకటేష్‌తో చేసిన ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించిన ఈ సినిమా వెంకటేష్ కెరీర్‌కు కొత్త జోష్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘ఎఫ్ 3’ కూడా మంచి వసూళ్లను రాబట్టి, వరుస ప్లాప్స్‌తో ఇబ్బంది పడుతున్న వెంకటేష్‌కు గట్టి కంబ్యాక్ ఇచ్చింది. దీంతో సీనియర్ హీరోలను కూడా అనిల్ రావిపూడి ఎంతో బాగా చూపించగలడనే పేరు ఇండస్ట్రీలో బలంగా స్థిరపడింది.ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ సినిమా అనిల్ కెరీర్‌లో పూర్తిగా భిన్నమైన ప్రయత్నంగా నిలిచింది. తొలిసారి తన కామెడీ ట్రాక్‌ను పూర్తిగా పక్కన పెట్టి, బానావో భేటికో షేర్ అనే సామాజిక సందేశంతో కూడిన కాన్సెప్ట్‌ను ఈ సినిమాకు కేంద్రబిందువుగా తీసుకున్నాడు. బాలయ్యను పవర్‌ఫుల్, ఎమోషనల్ పాత్రలో చూపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు అనిల్.
ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలను కూడా అనిల్ రావిపూడి ఎంత సమర్థంగా డీల్ చేయగలడో నిరూపించింది. అంతేకాదు, ‘భగవంత్ కేసరి’ సినిమాకు జాతీయ స్థాయిలో బెస్ట్ ఫిల్మ్ అవార్డు రావడం అనిల్ కెరీర్‌లో అత్యంత గర్వకారణంగా మారింది.లేటెస్ట్‌గా చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న మెగాస్టార్ చిరంజీవితో మనశంకర వరప్రసాద్ ప్రొడక్షన్‌లో తెరకెక్కిన సినిమా ద్వారా అనిల్ రావిపూడి మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. ఈ సినిమాతో చిరంజీవికి సాలిడ్ హిట్ ఇచ్చి, మెగాస్టార్ ఫ్యాన్స్‌కు కూడా పండగ తీసుకొచ్చాడు.
ఇప్పటివరకు తన కెరీర్‌లో మొత్తం 9 సినిమాలు చేసిన అనిల్ రావిపూడి, వాటిలో ఎక్కువ శాతం హిట్స్ సాధించడం విశేషం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరీర్‌లో తాను అత్యంత ఇష్టపడే సినిమా అంటే బాలకృష్ణతో చేసిన ‘భగవంత్ కేసరి’ అని వెల్లడించాడు. ఆ సినిమాకు నేషనల్ అవార్డు రావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, దర్శకుడిగా అది తనకు ప్రత్యేకమైన అనుభూతి అని చెప్పాడు.మొత్తానికి, కమర్షియల్ సినిమాల నుంచి మెసేజ్ ఓరియెంటెడ్ కథల వరకూ అన్ని జానర్స్‌లో సక్సెస్ సాధిస్తూ, టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల సరసన అనిల్ రావిపూడి నిలిచాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి