టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా మారుతీ దర్శకత్వంలో రూపొందిన ది రాజా సాబ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో నిధి అగర్వాల్ , మాళవిక మోహన్ ,  రీద్ది కుమార్ లు హీరోయిన్లుగా నటించగా ... బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9 వ తేదీన విడుదల చేశారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నెగటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా భారీ కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర వసూలు చేయలేక పోతుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 9 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ తొమ్మిది రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను , ఈ మూవీ ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధిస్తే హిట్ స్టేటస్ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

తొమ్మిది రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 77.54 కోట్ల షేర్ ... 114.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. 9 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 116.83 కోట్ల షేర్ ... 196.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమా 29 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరి లోకి దిగింది. దానితో ఈ మూవీ మరో 92.17 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబడితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకోవడం కాస్త కష్టమే అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: