టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మహేశ్ కుమారుడు గౌతమ్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలో యాక్టింగ్ సినిమాకు సంబంధించి కోర్సులు నేర్చుకుంటున్నట్లు సమాచారం. అభిమానులు కూడా గౌతమ్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా అని ఎదురుచూస్తున్నారు. దీంతో టాలీవుడ్ పరిశ్రమలో ఉండే దర్శక నిర్మాతలు కూడా గౌతమ్ ని హీరోగా లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.


తాజాగా గౌతమ్ గురించి ప్రముఖ నిర్మాతలలో ఒకరైన అనిల్ సుంకర మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అనిల్ సుంకర నిర్మాణంలో మహేష్ బాబు నటించిన దూకుడు, నేనొక్కడినే, ఆగడు వంటి సినిమాలు చేశారు. ఇందులో దూకుడు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఒక ఇంటర్వ్యూలో అనిల్ సుంకర మాట్లాడుతూ తాను కృష్ణ గారికి వీర అభిమానిని ,ఆయన తనతో బాగా మాట్లాడేవారు. నేను మహేష్ బాబు చాలా క్లోజ్, అలాగే మహేష్ కుమారుడు గౌతమ్ మా అబ్బాయి కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలియజేశారు.


గౌతమ్ ని హీరోగా ఎవరు పరిచయం చేసిన కూడా తన సపోర్టు ఉంటుందని తెలిపారు. గౌతమ్ సక్సెస్ కావాలని తెలిపారు. ఒకవేళ తనకి ఆ అవకాశం వస్తే వదులుకొను.. బెస్ట్ స్టోరీ ఎవరు ఇస్తే వాళ్లతో  చేయడం బెటర్ అని తెలియజేశారు. ఎవరు చేసినా కూడా గౌతమ్ ఫస్ట్ మూవీ సక్సెస్ కావాలని కోరిక అంటు తెలిపారు. అది ఒకవేళ నా నిర్మాణంలో అయితే మరింత ఆనందంగా ఫీల్ అవుతానని తెలిపారు అనిల్ సంకర. మహేష్ కుమారుడు గౌతమ్ ని హీరోగా పరిచయం చేయడానికి నిర్మాతల సిద్ధంగా ఉన్నప్పటికీ మరి గౌతమ్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో చూడాలి మరి. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో వారణాసి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: