సాధారణంగా ఇండియన్ సినిమాలకు, ముఖ్యంగా సౌత్ సినిమాలకు జపాన్‌లో మంచి క్రేజ్ ఉంటుంది. రాజమౌళి 'RRR' అక్కడ ₹145 కోట్ల వసూళ్లతో చరిత్ర సృష్టించింది. ఆ ఊపుతో పుష్ప 2 కూడా అక్కడ గర్జిస్తుందని అందరూ భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది.మిమోరిన్ (Mimorin) అధికారిక గణాంకాల ప్రకారం, జపాన్ వ్యాప్తంగా 53 థియేటర్లలో 68 లొకేషన్లలో విడుదలైన ఈ సినిమాకు కేవలం 886 మంది మాత్రమే వచ్చారు.మొదటి రోజు ప్రీమియర్లతో కలిపి సుమారు ₹55 లక్షల రూపాయలు (7.94 మిలియన్ యెన్) మాత్రమే వసూలు అయ్యాయి. ₹300 కోట్ల ఓపెనింగ్ చూసిన సినిమాకు ఇది చాలా తక్కువ నంబర్.
జపాన్‌లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన భారతీయ సినిమాల జాబితాలో పుష్ప 2 టాప్ 10 లో కూడా నిలవలేకపోయింది. 14వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.'RRR' మొదటి రోజు 8,230 అడ్మిషన్లు సాధించగా, ప్రభాస్ 'సాహో' 6,510, 'కల్కి 2898 AD' 3,700 టికెట్లు అమ్ముడయ్యాయి. చివరకు 'బ్రహ్మాస్త్ర', 'టైగర్ 3' వంటి సినిమాల కంటే కూడా పుష్ప 2 వెనకబడి ఉండటం గమనార్హం.అల్లు అర్జున్, రష్మిక మందన్న జపాన్ వెళ్లి అక్కడి ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. మీడియాలో కూడా భారీగానే హడావిడి జరిగింది. అయినా సరే, జపాన్ ఆడియన్స్‌కు పుష్పరాజ్ 'మాస్' మేనరిజం అంతగా కనెక్ట్ అవ్వలేదనిపిస్తోంది. అక్కడి వారు ఎక్కువగా ఎమోషన్స్ మరియు గ్రాండ్ విజువల్స్ (RRR, బాహుబలి లాంటివి) ఇష్టపడతారు. బహుశా 'పుష్ప'లోని పక్కా లోకల్ అండ్ స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్ వారికి అంతగా అర్థం కాలేదో లేక వారి అభిరుచికి దూరంగా ఉందో అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జపాన్ బాక్సాఫీస్ మార్కెట్ ఇండియా లాగా ఉండదు. ఇక్కడ మొదటి వీకెండ్ తోనే సినిమా ఫలితం తేలిపోతుంది, కానీ జపాన్‌లో సినిమాలకు 'లాంగ్ రన్' ఉంటుంది. వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంటే మెల్లగా పుంజుకునే అవకాశం ఉంది. గతంలో 'ముత్తు' సినిమా కూడా ఇలాగే మెల్లగా ఊపందుకుని అక్కడ సెన్సేషన్ అయ్యింది. కాబట్టి పుష్పరాజ్ తన రెండో వారంలో ఏమైనా అద్భుతం చేస్తాడేమో చూడాలి.మొత్తానికి ఇండియాను ఊపేసిన పుష్పరాజ్, జపాన్‌లో మాత్రం మెల్లగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ₹1800 కోట్ల మేజిక్ ఫిగర్ సాధించిన ఈ సినిమాకు జపాన్ కలెక్షన్లు ఒక చిన్న వెలితిగానే మిగిలిపోయాయి. అయినప్పటికీ, అల్లు అర్జున్ గ్లోబల్ వైడ్ తెలుగు సినిమా సత్తా చాటడానికి చేసిన ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి