తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. ఖమ్మం సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ద్రోహాలు ప్రోత్సహిస్తున్నాయని ఆయన ఆరోపించారు. రేవంత్ రాజకీయ జీవితం ద్రోహాల చరిత్రగా మారిందని వివరించారు. ఎన్టీఆర్ ద్వేషించిన కాంగ్రెస్ పార్టీలో చేరి టీడీపీకి వెన్నుపోటు పొడిచారని హరీశ్ అన్నారు.

 సీఎం పదవి అనుభవిస్తూ బీజేపీతో స్నేహాలు చేసి సోనియా రాహుల్ లను మోసం చేస్తున్నారని విమర్శించారు. అవినీతి దాహం ప్రజా ద్రోహం రేవంత్ లక్షణాలని ఆయన చెప్పారు. రేవంత్ అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారని హరీశ్ మండిపడ్డారు. మూసీ నది కంపు కంటే రేవంత్ మాటల కంపు ఎక్కువైందని వ్యాఖ్యానించారు. రేవంత్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని హరీశ్ ఆందోళన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ జెండా గద్దెలు ధ్వంసం చేయాలని రేవంత్ బహిరంగంగా పిలుపునిచ్చారని హరీశ్ ఆరోపించారు. అది శాంతి భద్రతలను దెబ్బతీయడమే అని అన్నారు. నేరాలు ప్రోత్సహించడం కాదా అని ప్రశ్నించారు. పోలీసు బాధ్యతలు ఎక్కడికి పోయాయని ఆయన నిలదీశారు. సీఎం నేర చర్యలు విద్వేషాలు రెచ్చగొడుతుంటే డీజీపీ మౌనం ఎందుకని హరీశ్ అడిగారు. చట్టం అందరికీ సమానమని నిరూపించే ధైర్యం పోలీసులకు ఉందా అని సవాల్ విసిరారు.

 రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులు ఆస్తుల ధ్వంసం పిలుపు ఇస్తున్నారని విమర్శించారు. ఇది రేవంత్ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన చెప్పారు. రేవంత్ ప్రభుత్వం రైజింగ్ కాదు ఫ్లయింగ్ సీఎం అని సెటైర్లు వేశారు. పాలమూరు ప్రాజెక్టులో రేవంత్ ద్రోహం చేశారని హరీశ్ ఆరోపించారు. కృష్ణా జలాల్లో తప్పుడు మాటలు చెప్పారని మండిపడ్డారు.

9490520108.. ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్యలు వివ‌రాలు పంపండి..

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్రజ‌ల స‌మ‌స్యలు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మ‌స్యలు, ఎమ్మెల్యేల ప‌నితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్రజ‌ల ఇబ్బందులు, అక్కడ అధికార‌, ప్రతిప‌క్ష పార్టీల ప‌రిస్థితులు, రాజ‌కీయ అంశాల‌పై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.

నోట్ :  వ్యక్తిగ‌త స‌మ‌స్యలు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: