గ్లామర్ డాల్స్ నుంచి గన్ పట్టిన గ్యాంగ్‌స్టర్స్ వరకు.. టాలీవుడ్ హీరోయిన్ల ప్రయాణం ఇప్పుడు నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది. సాఫ్ట్ క్యారెక్టర్లు పక్కన పెట్టి, జిమ్‌లో చెమటోడ్చి, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ థియేటర్లలో విలన్ల ఎముకలు విరగ్గొట్టేందుకు మన స్టార్ హీరోయిన్లు రెడీ అయిపోయారు. సమంత నుంచి అనుష్క వరకు, రష్మిక నుంచి కృతి శెట్టి వరకు అందరూ ఇప్పుడు 'యాక్షన్' మంత్రం జపిస్తున్నారు.టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత 'ఫ్యామిలీ మ్యాన్ 2'తోనే తనలో ఎంతటి యాక్షన్ పవర్ ఉందో చూపించింది. ఇప్పుడు రాజీవ్ అండ్ డికె దర్శకత్వంలో వస్తున్న 'సిటాడెల్: హనీ బన్నీ' కోసం ఆమె చేసిన ఫైట్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కేవలం గ్లామర్ మీద ఆధారపడకుండా, ఒంటి చేత్తో విలన్లను చితకబాదే స్పై పాత్రలో సామ్ నటిస్తోంది. ఇందుకోసం ఆమె ప్రత్యేకంగా హాలీవుడ్ స్టంట్ మాస్టర్ల దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకుంది.


మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే హీరోయిన్లకు డాన్స్ మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరపాటే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' (MSG) చిత్రంలో హీరోయిన్లు కూడా మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లో కనిపిస్తారని టాక్. చిరంజీవి మార్క్ యాక్షన్ కు తోడుగా, హీరోయిన్లు కూడా స్టెప్పులతో పాటు దెబ్బలు కూడా వేయబోతున్నారు.దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్న త్రిష, మెగాస్టార్‌తో చేస్తున్న 'విశ్వంభర'లో ఒక పవర్‌ఫుల్ అండ్ ఇంటెన్స్ రోల్‌లో కనిపించబోతోంది. సోషియో ఫాంటసీ మూవీ కావడంతో, ఇందులో త్రిష కొన్ని సాహసోపేతమైన విన్యాసాలు కూడా చేయనుందట. ఈ సినిమాతో త్రిష మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో యాక్షన్ క్వీన్‌గా మారడం ఖాయం.



నేషనల్ క్రష్ రష్మిక కూడా ఇప్పుడు యాక్షన్ వైపు మొగ్గు చూపుతోంది. 'పుష్ప 2'లో మాస్ లుక్ లో కనిపించడమే కాకుండా, రాబోయే కొన్ని భారీ ప్రాజెక్టుల్లో ఆమె కత్తి పట్టి యుద్ధం చేసే పాత్రలు చేయబోతోంది. "గ్లామర్ ఎప్పుడూ ఉంటుంది, కానీ యాక్షన్ ఇమేజ్ ఇస్తే వచ్చే కిక్కే వేరు" అని రష్మిక ఇప్పటికే హింట్ ఇచ్చింది.



ప్రస్తుతం ఆడియన్స్ పక్కా కమర్షియల్ అండ్ యాక్షన్ సినిమాలను ఆదరిస్తున్నారు.యాక్షన్ సినిమాలకు భాషా భేదం ఉండదు, అందుకే హీరోయిన్లు గ్లోబల్ ఆడియన్స్‌ను రీచ్ అవ్వడానికి ఈ రూటు ఎంచుకుంటున్నారు.అబలలు కాదు సబలలు అని నిరూపించే పాత్రల పట్ల మహిళా ప్రేక్షకుల్లో కూడా ఆదరణ పెరుగుతోంది.మొత్తానికి మన టాలీవుడ్ భామలు ఇప్పుడు పూల కుండీలు కాదు, బాంబుల్లా పేలడానికి సిద్ధమయ్యారు. స్క్రీన్ మీద వాళ్ళు వేసే స్టెప్పులకే కాదు, వాళ్ళు విసిరే పంచ్‌లకు కూడా థియేటర్లలో ఈలలు, గోలలు పక్కా! లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు కోసం ఇప్పుడు టాలీవుడ్ లో ఒక గట్టి పోటీ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: