‘రాజకుమారుడు’ సినిమా షూటింగ్ సమయంలో కూడా అదే స్టైల్‌లో ఒక రొమాంటిక్ సీన్‌ను ప్లాన్ చేశారట. ఆ సన్నివేశంలో ఒకే కూల్ డ్రింక్‌లో రెండు స్ట్రాలు పెట్టి, హీరో మహేశ్ బాబు మరియు హీరోయిన్ ప్రీతీ జింటా ఇద్దరూ కలిసి తాగాలి అన్నది దర్శకుడి ఆలోచనట. కానీ ఈ సీన్ విషయంలోనే అసలు సమస్య మొదలైందని చెబుతారు.హీరోయిన్ తాగిన అదే కూల్ డ్రింక్‌ను తాను తాగాలా? అంటూ మహేశ్ బాబు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారట. ఈ సీన్ తనకు ఇష్టం లేదని, చేయలేనని స్పష్టంగా చెప్పారని సమాచారం. దాంతో దర్శకుడు రాఘవేంద్రరావుతో ఆయనకు మాటల వరకు వెళ్లిందని, ఆ కోపంలోనే షూటింగ్‌ను మధ్యలో ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయారట.
అయితే ఈ ఘటనకు మరో కోణం కూడా ఉందని చెబుతారు. మహేశ్ బాబు – రాఘవేంద్రరావు మధ్య ఉన్న సన్నిహిత బంధమే ఇందుకు కారణమట. మహేశ్ బాబు, రాఘవేంద్రరావును ప్రేమగా “మావయ్య” అని పిలుస్తారనే విషయం తెలిసిందే. ఆ చనువు, ఆ సన్నిహిత సంబంధం వల్లే మహేశ్ బాబు తన అసహనాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా బహిరంగంగా వ్యక్తం చేశారని ఇండస్ట్రీ వర్గాల టాక్. వేరే దర్శకుడైతే ఇంత ఓపెన్‌గా రియాక్ట్ అయ్యేవారు కాదేమో అని కూడా కొందరు అభిప్రాయపడతారు.తర్వాత పరిస్థితిని సర్దుబాటు చేసిన దర్శకుడు, ఆ సీన్‌ను రెండు సెపరేట్ షాట్స్‌లో తీసినట్టు తెలుస్తోంది. సినిమాల్లో ఒకే కూల్ డ్రింక్, రెండు స్ట్రాలు కనిపించినా… వాస్తవంగా హీరో, హీరోయిన్ ఒకే గ్లాస్‌లో తాగినట్టు కాదు. కెమెరా యాంగిల్స్, ఎడిటింగ్‌తో అలా చూపించారట. కానీ మహేశ్ బాబు మాత్రం మొదట నిజంగానే అలా తాగాలేమో అని భావించి, అలిగి వెళ్లిపోయారని చెప్పుకుంటారు.
ఈ సంఘటనను మహేశ్ బాబు స్వయంగా ఒక సందర్భంలో సరదాగా ప్రస్తావించినట్టు కూడా అభిమానులు చెబుతుంటారు. అయితే ఇది పూర్తిగా నిజమా? లేక కాలక్రమంలో కొంచెం మసాలా కలిసిన కథనా? అన్నది ఖచ్చితంగా చెప్పలేం. కానీ సూపర్ స్టార్ కెరీర్ ప్రారంభంలో జరిగిన ఈ సంఘటన మాత్రం గతంలోనూ సోషల్ మీడియాలో వైరల్ అయింది… ఇప్పుడు మళ్లీ అదే కథ చర్చకు వచ్చింది.నిజం ఎంత ఉందో తెలియకపోయినా, మహేశ్ బాబు ప్రొఫెషనలిజం, తనకు నచ్చని విషయాలపై గట్టి స్టాండ్ తీసుకునే స్వభావాన్ని ఈ కథ చూపిస్తుందని ఆయన అభిమానులు మాత్రం చెప్పుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి