ఇక ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఇక హోప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ హోప్ లియో ఇంకా హోప్ లైఫ్ అనే రెండు కొత్త ఈ- బైక్స్ ని తయారు చేసింది. ఇక త్వరలో ఈ-మోటర్‌ బైక్స్ ను విడుదల చేయబోతోంది. హోప్ ఈ-బైక్స్ ఆర్ అండ్ డి పరిశోధనలపై ఆధారపడి ఉంటాయి.ఇక వీటి ధర వచ్చేసి రూ. 65,500 నుండి మొదలవుతుంది.ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు లో 125 కి.మీ వరకు హై రేంజ్, 72 వి ఆర్కిటెక్చర్లు ఉంటాయి.హోప్ లియో ఇంకా లైఫ్ రెండింటికీ 180 కిలోల లోడింగ్ సామర్థ్యం అనేది ఉంటుంది.ఈ ఈ- బైక్స్ లో హై పర్ఫామెన్స్ మోటార్, 19.5 లీటర్ల బూట్ స్పేస్, కనెక్ట్ ఫీచర్స్ అయిన ఇంటర్నెట్, జిపిఎస్, మొబైల్ యాప్ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయి.

ఇక హోప్ లియో ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే.. ఇది మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి లియో బేసిక్, లియో ఇంకా లియో ఎక్స్‌టెండెడ్ వేరియంట్లు.ఈ ఎలక్ట్రిక్ బైక్ డ్యూయల్ 2 ఎక్స్ లి-అయాన్ బ్యాటరీలను కలిగి ఉంటుంది.ఇక ఈ స్కూటర్ ఒకే ఛార్జీపై 125 కిలోమీటర్ల వరకు వెళ్ళగలదు.ఇక లియో ఎక్స్‌టెండెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఒక సమయంలో 2700డబ్ల్యు వరకు మోటార్ పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది.ఇక దీని హై స్పీడ్ 60 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

ఇక హోప్ లైఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే.. ఇది లైఫ్ బేసిక్, లైఫ్ ఇంకా లైఫ్ ఎక్స్‌టెండెడ్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది.హోప్ లియో లాగానే, ఈ లైఫ్ మోడల్ డ్యూయల్ 2ఎక్స్ లి-అయాన్ బ్యాటరీలను కలిగి ఉంటుంది. ఇక అలాగే ఈ ఈ -బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 125 కిలోమీటర్ల దాకా వెళ్ళగలదు.ఇక ఈ స్కూటర్ హై స్పీడ్ విషయానికి వస్తే ఇది 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది.లైఫ్ ఎక్స్‌టెండెడ్ ఎలక్ట్రిక్ మోటార్ 2000డబ్ల్యు వరకు మోటార్ పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది.


ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో పార్క్ అసిస్ట్, 5 కిలోమీటర్ల రివర్స్ గేర్, సైడ్ స్టాండ్ సెన్సార్, రిజర్వ్ మోడ్, త్రీ రైడ్ మోడ్లు, ఎల్‌ఇడి కన్సోల్, డ్యూయల్ డిస్క్ బ్రేక్, యుఎస్‌బి ఛార్జింగ్, రిమోట్ కీ, యాంటీ-తెఫ్ట్ అలారం వంటి ఫీచర్స్ ఉంటాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: