ఇక టొయోట కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫేమస్ వాహన తయారీ సంస్థ టొయోట 2021 సెప్టెంబర్ అమ్మకాల నివేదికను అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఇక ఈ కంపెనీ విడుదల చేసిన నివేదికల ప్రకారం తెలిసిందేంటంటే.. పోయిన సెప్టెంబర్ నెలలో మొత్తం 9,284 యూనిట్లను అమ్మి , మార్కెట్లో 14 శాతం వృద్ధిని నమోదు చేయడం అనేది జరిగింది. గత ఏడాది అంటే 2020 లో కంపెనీ మొత్తం 8,116 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను అమ్మినట్లు తెలిపింది.ఇక కంపెనీ మొత్తం అమ్మకాల విషయానికొస్తే, ఈ సంవత్సరం 2021 జనవరి ఇంకా 2021 సెప్టెంబర్ మధ్య 94,493 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను అమ్మడం అనేది జరిగింది.ఇక గత ఏడాది ఇదే సమయంలో (2020 జనవరి ఇంకా 2020 సెప్టెంబర్) 47,743 యూనిట్లను అమ్మడం జరిగింది.ఇక దీన్ని బట్టి చూస్తే కంపెనీ మొత్తం అమ్మకాలు వచ్చేసి మునుపటికంటే 98 శాతం వృద్ధిని నమోదు చేయడం జరిగింది.

ఇక ఇండియాలో కరోనా మహమ్మారి ఎక్కువగా వ్యాపించిన సమయంలో ఆటో పరిశ్రమ మొత్తం కూడా చాలా నష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇక ఇందులో టొయోట కంపెనీ కూడా ఉంది. అయితే ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టి పరిస్థితి సాధారణ స్థితికి చేరడం జరిగింది. కాబట్టి ఈ సమయంలో టొయోట యొక్క అమ్మకాలు మళ్ళీ ఎక్కువయ్యాయి.ఇక ఇప్పుడు ఇండియాలోపండుగ సీజన్ ప్రారంభమవ్వడం జరిగింది.కాబట్టి కంపెనీ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ క్రమంలో టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ వి. విసిలిన్ సిగమణి మాట్లాడుతూ, పండుగ సీజన్ దగ్గరపడే కొద్దీ కంపెనీ అమ్మకాలు అనేవి ఎక్కువ పెరుగుదల దిశవైపు సాగుతుందని తెలిపడం జరిగింది.ఇక దీన్ని బట్టి చూస్తే, కంపెనీ అమ్మకాలు పెరుగుతాయని అనేది ఇక్కడ ఖచ్చితంగా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: