ఇక భారతదేశంలో విడుదలైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలలో ఇప్పటి దాకా లో-స్పీడ్ ఎలక్ట్రిక్ మోపెడ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు, హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైకులు ఇంకా అలాగే ఎలక్ట్రిక్ క్రూజర్ మోటార్‌సైకిళ్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. అయితే, కేవలం మూడే సెకండ్లలో గంటకు గరిష్టంగా 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకునే ఎలక్ట్రిక్ హైపర్-స్పోర్ట్స్ సూపర్ బైక్ (Electric Hyper-Sports Super Bike) అనేది ఇంకా అసలు రాలేదు.ఇక అలాంటి ఓ హై-పెర్ఫార్మెన్స్ ఇ-బైక్ ను తీసుకురాబోతోంది ట్రౌవ్ మోటార్ (Trouve Motor) కంపెనీ.ఇక ఐఐటి ఢిల్లీకి చెందిన వ్యాపార సంస్థ ట్రౌవ్ మోటార్ (Trouve Motor), భారతదేశంలో ఓ అధునాతన ఎలక్ట్రిక్ హైపర్-స్పోర్ట్స్ సూపర్‌బైక్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. ఈ సూపర్‌బైక్ గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలదని ఇంకా అలాగే కేవలం మూడు సెకన్లలో 0-100 కెఎంపిహెచ్ వేగంతో వెళ్లగలదని కంపెనీ చెబుతోంది. ఈ మేరకు ట్రౌవ్ మోటార్ ఓ టీజర్ ను కూడా రిలీజ్ చేసింది.ఇంకా పేరు కన్ఫర్మ్ చేయని ట్రౌవ్ ఎలక్ట్రిక్ హైపర్ స్పోర్ట్స్ బైక్ లో 40 kW శక్తిని ఉత్పత్తి చేసే లిక్విడ్ కూల్డ్ ఏసి ఇండక్షన్ మోటార్ కూడా ఉంటుందని కంపెనీ పేర్కొంది.
 


ఇందులో లేజర్ లైటింగ్ ప్యాకేజ్, అడ్వాన్స్‌డ్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఇంకా 360 కెమెరా అలాగే టిఎఫ్‌టి టచ్ స్క్రీన్ డిస్‌ప్లే వంటి ఆధునిక టెక్ ఫీచర్లు మరెన్నో కూడా ఉండబోతున్నాయని కంపెనీ తెలిపింది. అయితే, ఇందులో ఉపయోగించబోయే బ్యాటరీ ప్యాక్ ఇంకా అలాగే దాని రేంజ్ వంటి ఇతర విషయాలను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు.ఇక అంతేకాకుండా, ఈ ట్రౌవ్ ఎలక్ట్రిక్ హైపర్ స్పోర్ట్స్ బైక్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ, జిపిఎస్ నావిగేషన్ ఇంకా అలాగే రియల్ టైమ్ వెహికల్ డయాగ్నస్టిక్ వంటి సూపర్ ఫీచర్లు కూడా ఉండనున్నాయి. అలాగే, ఇందులో డ్యూయల్-ఛానల్ ఏబిఎస్, సర్దుబాటు చేయగల సస్పెన్షన్‌ సెటప్ ఇంకా అలాగే బ్రెంబో బ్రేక్‌లు వంటి హార్డ్‌వేర్‌ను కూడా పొందుతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల విభాగంలో ఫస్ట్ కనిపించే అనేక పేటెంట్ టెక్నాలజీలను కూడా ఈ బైక్ పొందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: