ఫేమస్ ఫ్రెంచ్ కార్ బ్రాండ్ 'సిట్రోయెన్' (Citroen) భారతీయ మార్కెట్లో తన 'సి 5 ఎయిర్‌క్రాస్' (C5 Aircross) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇండియన్ మార్కెట్లో ఈ కొత్త SUV విడుదలైనప్పుడు దాని ధర రూ. 29.90 లక్షలు వుంది. అయితే కంపెనీ ఈ SUV ధరలను ఇప్పటికే రెండు సార్లు పెంచడం జరిగింది. ఇప్పుడు మరో సారి కూడా ఈ SUV కార్ ధరలను పెంచింది.ఇక దేశీయ మార్కెట్లో సిట్రోయెన్ ఇండియా తన సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్‌ను మొత్తం మూడు వేరియంట్‌లలో అమ్ముతుంది. అవి ఫీల్ (మోనో-టోన్), ఫీల్ (డ్యూయల్-టోన్) ఇంకా షైన్ (మోనో మరియు డ్యూయల్-టోన్) వేరియంట్లు. ఈ మూడు వేరియంట్ల ధరలను కూడా ఇప్పుడు ఏకంగా రూ. 45,000 వరకు పెంచింది.ఇక ధరలు పెరుగుదల తరువాత బేస్-స్పెక్ ఫీల్ (మోనో-టోన్) వేరియంట్ వచ్చేసి రూ. 32.63 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది. ఈ వేరియంట్ మునుపటి ధర వచ్చేసి రూ. 32.23 లక్షలు. ఇక మిడ్-స్పెక్ ఫీల్ (డ్యూయల్-టోన్) వేరియంట్ ధర గతంలో రూ. 32.73 లక్షలు (ఎక్స్-షోరూమ్) వుంది..ఇక ఇప్పుడు ఈ వేరియంట్ ధర వచ్చేసి రూ. 33.18 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది.ఇక అదే సమయంలో సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్  టాప్-స్పెక్ షైన్ (మోనో మరియు డ్యూయల్-టోన్) ధర వచ్చేసి గతంలో రూ. 33.78 లక్షల ధరకు అమ్మబడింది. అయితే ఇప్పుడు ధరల పెరుగుదల తరువాత దీని ధర వచ్చేసి రూ. 34.23 లక్షలకు (ఎక్స్-షోరూమ్) పెరిగింది.



ఈ SUV కార్ మార్కెట్లో విడుదలైనప్పటినుంచి ఇప్పటికి ఏకంగా రూ. 2.80 లక్షల పెరుగుదలను పొందడం జరిగింది.ఇక సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ కంపెనీ పిఎస్‌ఎ ఇఎమ్‌పి 2 ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటుంది. సిట్రాన్ సి 5 ఎయిర్‌క్రాస్ క్రాస్ఓవర్ డిజైన్‌ను కలిగి ఉండేలా డిజైన్ చెయ్యబడింది.ఇక ఈ కార్  డ్యూయల్ బీమ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్, ట్విన్ స్లాట్ స్ప్లిట్ ఫ్రంట్ గ్రిల్, 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్స్ ఇంకా అలాగే స్ప్లిట్ టెయిల్ లాంప్‌ కలిగి ఉంటుంది.సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ ఇంటీరియర్ విషయానికి కనుక వస్తే, ఈ కార్ లో ఫుట్ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, ఇంజిన్ స్టాప్-స్టార్ట్ ఫంక్షన్, 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఫోన్ మిర్రరింగ్ ఫంక్షన్‌తో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే ఇంకా అలాగే ఆండ్రాయిడ్ ఆటో వంటివి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: