ఇక ఇటీవలే కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ (2022 hyundai Venue Facelift) మోడల్ ని విడుదల చేసిన కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ ఇప్పుడు తమ కొత్త తరం హ్యుందాయ్ టూసాన్ (New Gen 2022 hyundai Tucson) ప్రీమియం ఎస్‌యూవీ కార్ ని కూడా భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఇక హ్యుందాయ్ ఇండియా ప్రకారం,ఈ నాల్గవ తరం హ్యుందాయ్ టూసాన్ ఎస్‌యూవీని కంపెనీ జూలై 13, 2022వ తేదీన దేశీయ విపణిలో విడుదల కానుంది. ఈ ప్రీమియం ఎస్‌యూవీ కార్ కి సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఇక భారతదేశంలో క్రెటా ఇంకా అలాగే వెన్యూ ఎస్‌యూవీలు గొప్ప విజయం సాధించిన నేపథ్యంలో, ఈ కొత్త తరం టూసాన్ ఎస్‌యూవీపై హ్యుందాయ్ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ హ్యుందాయ్ టూసాన్ భారత్‌లో విక్రయించబడటం ఇదేం మొదటిసారి కాదు. హ్యుందాయ్ కంపెనీ చాలా ఏళ్లుగా ఈ కారును భారత్‌లో విక్రయానికి అందుబాటులో ఉంచింది. అయితే, ఇది ఆశించిన అమ్మకాలను సాధించడంలో మాత్రం విఫలమైంది. కానీ ఈ మోడల్ అయితే ప్రపంచ మార్కెట్లలో మంచి విజయాన్ని సాధించింది.హ్యుందాయ్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పటికే 7 లక్షల యూనిట్లకు పైగా టూసాన్ ఎస్‌యూవీలను విక్రయించగలిగింది.


హ్యుందాయ్ టూసాన్ కార్ మార్కెట్లో మొదటిసారిగా విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ కూడా నాలుగు తరాల మోడళ్లు వచ్చాయి. తాజాగా, భారతదేశంలో విడుదల కాబోతున్న నాల్గవ తరం హ్యుందాయ్ టూసాన్ ఎస్‌యూవీ కార్ ని కంపెనీ 2020 లోనే అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసింది. సరికొత్త డిజైన్ లాంగ్వేజ్ ఇంకా అలాగే అద్భుతమైన ఫీచర్లతో వచ్చిన ఈ కొత్త మోడల్ ఇప్పటికే మంచి హిట్ అయ్యింది.ఇక పాత మోడల్ తో పోలిస్తే కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ ఎస్‌యూవీ పూర్తిగా రీడిజైన్ చేయబడింది. ఇది హ్యుందాయ్ లేటెస్ట్ డిజైన్ ఫిలాసఫీ ఇంకా సెన్సుయస్ స్పోర్టినెస్‌ ఆధారంగా రూపొందించబడింది. ఈ కారులో ముందు వైపు కొత్త 3డి క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్‌ ఇంకా ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన హెడ్‌ల్యాంప్ సెటప్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌‌తో కూడిన ఫ్రంట్ బంపర్, సైడ్స్ లో షార్ప్ బాడీ లైన్స్ ఇంకా అలాగే రాక్డ్ విండో లైన్ తో ఇది మంచి స్పోర్టీ లుక్ ని కలిగి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: