టయోటా కంపెనీ లాంచ్ చేసిన కొత్త 'ఇన్నోవా హైక్రాస్' (Innova Hycross) ఈమధ్యనే జెనిక్స్ పేరుతో ఇండోనేషియన్ మార్కెట్లో కూడా లాంచ్ చేశారు. ఈ MPV కొత్త ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేయబడి ఉంటుంది.అందువల్ల ఇది ఆధునిక డిజైన్ ఇంకా అధునాతన ఫీచర్స్ పొందుతుంది. పనితీరు పరంగా కూడా చాలా బాగా ఉంటుంది. ఈ కొత్త హైక్రాస్ MPV గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ టయోటా ఇన్నోవా హైక్రాస్ పూర్తిగా కొత్త మోడల్, ఇది ఫస్ట్ మోనోకోక్ ఇన్నోవా కూడా. ఇది చూడటానికి దాదాపు ఈ మధ్యనే ఇండోనియా మార్కెట్లో అడుగుపెట్టిన 'ఇన్నోవా జెనిక్స్' లాగా ఉంటుంది. ఈ హైక్రాస్ హెక్సా గోనల్ గ్రిల్ కలిగి దాని మధ్యలో బ్రాండ్ లోగో కలిగి ఉంది. అలాగే ఇది క్రోమ్ తో ఫినిష్ అయి ఉంటుంది. అందువల్ల ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.ఇక ఇందులో ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇంకా అలాగే రీ డిజైన్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు కూడా ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ లో 10 స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇంకా భాగంలో స్పోర్ట్స్ ర్యాప్‌రౌండ్ టెయిల్‌లైట్‌ ఇంకా ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ వంటివి కూడా ఉన్నాయి.


మొత్తం మీద ఇది లేటెస్ట్ డిజైన్ కలిగి ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది.ఈ కార్ డ్యూయెల్ టోన్ థీమ్ పొందుతుంది. అందువల్ల ఇది ప్రీమియం ఎక్స్పీరియన్స్ ని కలిగిస్తుంది. అలాగే ఈ కారులో 10.1 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో ఇంకా ఆపిల్ కార్ప్లే వంటి వాటికీ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ కారులో ఉన్న సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చిన్న 4.2 ఇంచెస్ MID స్క్రీన్‌ను పొందుతుంది.ఈ టయోటా ఇన్నోవా హైక్రాస్ కార్  మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్యాడిల్ షిఫ్టర్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 9 స్పీకర్ జెబిఎల్ ఆడియో సిస్టమ్ ఇంకా అలాగే యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్స్  కలిగి ఉంది.ఇంకా అంతే కాకుండా ఇన్నోవా హైక్రాస్ ఇప్పుడు పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్‌ ఫీచర్ కూడా కలిగి ఉంది. ఈ కొత్త MPV మొత్తం ఐదు వేరియంట్స్ లో అందుబాటులోకి రానుంది.ధర అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ఇది ఈ కార్ రూ. 22 లక్షల నుంచి రూ. 28 లక్షల మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: