ఇంటర్నేషనల్ ట్రాక్టర్‌ లిమిటెడ్‌(ITL) ఇండియాలో సరికొత్త ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను ప్రవేశపెట్టింది.  SV సిరీస్‌ ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్‌, సిరీస్‌ S, సిరీస్‌ C, సిరీస్‌ H, సిరీస్‌ N ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను లాంచ్‌ చేసింది.ఇందుకోసం గాను ఈ ట్రాక్టర్ల తయారీకి కంపెనీ మొత్తం రూ.850 కోట్లు పెట్టుబడి పెట్టింది.ఫేమస్ ట్రాక్టర్ల తయారీ కంపెనీ ITL ప్రస్తుతం భారత మార్కెట్లో సోనాలికా ట్రాక్టర్‌(Sonalika Tractors)లను విడుదల చేసి సేల్ చేస్తుంది. ఇంకా అంతే కాకుండా వచ్చే మూడేళ్లలో ఐటీఎల్‌ కంపెనీ వృద్ధిని రెట్టింపు చేయాలని కూడా యోచిస్తోంది. ఐటీఎల్‌ అంతర్జాతీయంగా కూడా ట్రాక్టర్లను అమ్ముతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 14 న గురుగ్రామ్‌లో జరిగిన కార్యక్రమంలో మొత్తం 5 కొత్త ట్రాక్టర్లను పరిచయం చేసింది.ఇక కొత్తగా విడుదల చేసిన ట్రాక్టర్లన్నీ ఎలక్ట్రికల్‌ పవర్‌తో నడిచేవి. ఈ లిస్ట్ లో ఉన్న sv సిరీస్‌ ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్‌.. ఆల్‌ బ్రాండ్‌ ఎలక్ట్రిక్‌ మోడల్‌.. ఇది ITL  Solies బ్రాండ్ క్రింద అభివృద్ధి చేయబడింది. దీనిని ప్రత్యేకంగా యూరప్, అమెరికా, ఆఫ్రికా ఇంకా దక్షిణ అమెరికా లాంటి అంతర్జాతీయ మార్కెట్‌ కోసం అభివృద్ధి చేశారు.


sv సిరీస్ ట్రాక్టర్లు ఎక్కువ టార్క్‌ను జనరేట్ చేస్తాయి.ఇంకా అంతేకాకుండా ఇవి ఫాస్ట్‌ ఛార్జింగ్‌ కెపాసిటీని కలిగి ఉన్నాయి. దీనిని కేవలం 3 నుండి 3.5 గంటల్లో 0 నుండి 100 శాతం పూర్తిగా ఛార్జ్ అయ్యేలా డిజైన్ చేశారు. సాధారణంగా ఇలాంటి వాహనాలను ఛార్జ్ చేయడానికి 8 నుంచి 9 గంటలు సమయం పడుతుంది.ఇంకా సిరీస్‌ H, సిరీస్‌ S ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు ఇంటర్నేషనల్ మార్కెట్లో అరంగేట్రం చేశాయి. కానీ C సిరీస్ ట్రాక్టర్‌ మాత్రం యూరోపియన్‌ మార్కెట్‌కు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇంకా సిరీస్‌ N ట్రాక్టర్లు యూరప్, అమెరికా, ఆఫ్రికా ఇంకా దక్షిణ అమెరికాలో మాత్రమే మార్కెట్‌ను కలిగి ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.ఇక ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల ఉత్పత్తి కోసం ITL దాదాపు రూ. 850 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇందుకోసం కంపెనీ కొత్త ప్లాంట్‌ను కూడా నిర్మించనుంది. ఇంకా కొత్త ట్రాక్టర్ల పరిశోధన, అభివృద్ధి పనుల కోసం మొత్తం రూ.150 కోట్లు పెట్టుబడి పెట్టింది. దీంతో రైతుల కోసం అద్భుతమైన పనితీరుతో ట్రాక్టర్లను తయారు చేసి అమ్మాలని కంపెనీ భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: