చాలా మంది కూడా మచ్చలు, మొటిమలు ఇంకా ముడతలు వంటి వివిధ రకాల చర్మ సమస్యలతో ఎంతగానో బాధపడుతున్నారు. వాతావరణ కాలుష్యం ఇంకా అలాగే మనం తీసుకునే ఆహారమే ఈ సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం. శరీరంపై ఉండే చర్మం కంటే ముఖంపై ఉండే చర్మం చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అందుకే ముఖ చర్మంపై దుమ్ము, ధూళి ఇంకా మృతకణాలు త్వరగా పేరుకుపోతాయి. దీంతో మొటిమలు వంటి సమస్యలు సులభంగా తలెత్తుతాయి.అలాగే సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు కూడా చాలా త్వరగా వస్తాయి. ఇటువంటి సమస్యలతో బాధపడే వారు ఎగ్ ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకుని వాడడం వల్ల ఖచ్చితంగా అందమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ ప్యాక్ ను వాడటం వల్ల చర్మ సమస్యలన్నీ తొలగిపోయి ముఖం అందంగా కనబడుతుంది. ముఖంపై నలుపును, ముడతలను ఇంకా అలాగే మచ్చలను తగ్గించే ఈ ఎగ్ ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇంకా ఈ ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో అర చెక్క నిమ్మరసాన్ని ఇంకా ఒక టీ స్పూన్ పంచదారను తీసుకుని కలపాలి.


ఆ తరువాత ఇందులో కోడిగుడ్డు తెల్లసొనను వేసి బాగా కలపాలి. తరువాత ఇందులో ఒకటి లేదా రెండు టీ స్పూన్ల శనగపిండిని కూడా వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎగ్ ఫేస్ ప్యాక్ అనేది తయారవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ను వేసుకునే ముందు ముఖాన్ని బాగా శుభ్రంగా కడగాలి.ఆ తరువాత ఈ ఫేస్ ప్యాక్ ను మీ ముఖానికి రాసుకోవాలి. ఒకసారి రాసుకున్న కోడిగుడ్డు మిశ్రమం ఆరిన తరువాత దానిపై మళ్ళీ అదే మిశ్రమాన్ని రాసుకోవాలి. అంటే  రెండుసార్లు ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. రెండు సార్లు రాసుకున్న మిశ్రమం ఆరిన తరువాత సాధారణ నీటితో శుభ్రంగా కడిగి వేయాలి. అయితే ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి రాసుకున్న సమయంలో మాత్రం మాట్లాడకుండా ఉండాలి. ఈ విధంగా ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండు సార్లు వాడటం వల్ల మనం చాలా సులభంగా ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు. ఈ టిప్ ని ఉపయోగించడం వల్ల ముఖం పై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మృతకణాలు తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: