టాలీవుడ్లో కొన్ని బీ గ్రేడ్ సినిమాల్లో నటిస్తోన్న హీరోయిన్లు కెరీర్ ఆరంభంలోనే సినిమాల్లో ఛాన్సుల కోసం అందాలను ఓ రేంజ్లో ఆరబోస్తున్నారు. ఆ తర్వాత అస్సలు పట్టించుకునే వాళ్లే లేకపోవడంతో సోషల్ మీడియాలో తమ హాట్ హాట్ అందాల ఫొటోలు పెడుతూ ఎవరైనా ఒక్క ఛాన్స్ అయినా ఇవ్వరా అని వెయిటింగ్ చేస్తున్నారు. తాజాగా రాయ్ లక్ష్మీ లాంటి వాళ్ల హాట్ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన భామ నిక్కీ తంబోలి కూడా ఇప్పుడు అదే పని చేస్తోంది.
మొదటి సినిమాలోనే కావాల్సినంత అందాలు ఆరబోసిన ఈ బ్యూటీ కి బోల్డ్ హీరోయిన్ అన్న ముద్ర పడిపోయింది. ఈ సినిమా ప్లాప్ అయ్యాక ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో తంబోలీ తాను ప్రాధాన్యం ఉన్న రోల్స్ మాత్రమే ఎంచుకుంటానని... అడల్ట్ కామెడీ తరహా సినిమాలు చేయబోననీ చెప్పింది. ఈ క్రమంలోనే రాఘవ లారెన్స్ పక్కన కాంచన 3 సినిమాలో చేసింది. ఈ సినిమా హిట్ అయ్యాక ఆమెకు మంచి అవకాశాలే వచ్చాయి. కోలీవుడ్‌తో పాటు అటు తమిళ్లో సైతం మంచి అవకాశాలు కొట్టేసింది.
ఆమె ఎన్ని సినిమాలు చేస్తున్నా ఆమె చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాతో ఆమెపై పడ్డ బోల్డ్ ముద్ర చెరిపేసుకునేందుకు నానా పాట్లు పడుతోంది. ఇక తాజాగా లాక్డౌన్ వేళ మత్తెక్కించే హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తోంది. గులాబీ రంగు బ్రెస్ వేసుకుని మంచం పక్కన పడుకుని అందాల హోయలు ఆరబోస్తోన్న నిక్కీని చూస్తుంటే పదే పదే కళ్లార్పకుండా చూడాలనిపించేలా ఉంది.