బాలీవుడ్ పవర్ ఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న అమితాబ్, జయా బచ్చన్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇటీవల పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అభిమానులు సినీ రాజకీయ ప్రముఖులు వారికి విష్ చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో అయితే వారి అనుబంధానికి సంబంధించిన ఎన్నో వీడియో లను అభిమానులు షేర్ చేస్తూ విష్ చేసారు.
అటు సినీ ప్రముఖులతో పాటుగా జాతీయ మీడియా కొన్ని కథనాలను ప్రసారం చేసింది. ఈ నేపధ్యంలోనే వారి అందరికి కూడా అమితాబ్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలుపుతూ ఒక ట్వీట్ కూడా చేసారు. మా వార్షికోత్సవానికి శుభాకాంక్షలు తెలిపిన వారికి మా కృతజ్ఞతలు... అంటూ జయతో కలిసి దిగిన పిక్ ని పోస్ట్ చేసారు.
T 3552 - Our gratitude to them that wished us on our Anniversary .. 🙏❤️🌹🤗 pic.twitter.com/m3dvIMrVxE
— amitabh bachchan (@SrBachchan) June 4, 2020