రాజస్థాన్, సహా నాలుగు రాష్ట్రాలకు మిడతలు చుక్కలు చూపిస్తున్నాయి. మిడతల కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే అవి దాడి చేస్తున్న నేపధ్యంలో ఇప్పుడు కాస్త ఎక్కువగానే దృష్టి పెట్టాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇదిలా ఉంటే తాజాగా రాజస్థాన్ లోని జైసల్మేర్ లో మిడతలు దాడి చేసాయి. 

 

దీనితో డ్రోన్ లను వినియోగిస్తుంది అక్కడి వ్యవసాయ శాఖ. జైసల్మేర్‌కు రావడంతో రసాయనాలను పిచికారీ చేయడానికి డ్రోన్లు ఉపయోగించామని అక్కడి అధికారులు వెల్లడించారు. మిడతలు ప్రస్తుతం మధ్య ప్రదేశ్ దిశగా వెళ్తున్నాయి అని అధికారులు అంటున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలి అని అవి ఏ సమయంలో అయినా సరే దాడి చేయవచ్చు అని హెచ్చరిస్తున్నారు. ఇటు తెలంగాణా కూడా అప్రమత్తం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: