దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ కొరతతో నాలుగైదు రోజుల నుంచి 50 మందికి పైగా మరణించారు. ఈ తరుణంలో ఆక్సిజన్ సమస్యను అధిగమించేందుకు ఢిల్లీ ప్రభుత్వం .. వచ్చే నెల చివరి నాటికి ఢిల్లీలో 44 కొత్త ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. వీటిలో ఎనిమిదింటిని కేంద్రం ఏర్పాటు చేస్తుండగా.. మిగిలిన ప్లాంట్ల ఏర్పాటు బాధ్యతను ఢిల్లీ ప్రభుత్వమే తీసుకుందని తెలిపారు. ఢిల్లీలో ఆక్సిజన్ సమస్యను అధిగమించేందుకు బ్యాంకాక్ నుంచి 18 ట్యాంకర్లను దిగుమతి చేసుకుంటున్నామని కేజ్రీవాల్ వెల్లడించారు. దీంతోపాటు.. వెంటనే ఉత్పత్తి ప్రారంభించే స్థితిలో ఉన్న మరో 21 ఆక్సిజన్ తయారీ ప్లాంట్లను ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: