పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత రేవంత్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగానే టార్గెట్ చేసారు. ఈ నేపధ్యంలోనే పెట్రోల్ ధరల విషయంలో నిరసనగా నేడు రాజభవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం నిమిత్తం జూబ్లిహిల్స్ తన నివాసం నుంచి ఇందిరాపార్క్ దర్నా చౌక్ కు బయలుదేరిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి... మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని తీవ్ర కామెంట్స్ చేసారు.

మోదీ సూచలనలతోనే కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ అందళనలను అడ్డుకుంటోందన్న రేవంత్... కేసీఆర్ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తోన్న కొందరు అధికారులు మూల్యం చెల్లిస్తారు అంటూ హెచ్చరించారు. ఐజీ ప్రభాకరరావు ఖాసిం రిజ్వీ మాదిరి వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఇంటిలిజెన్స్ ఐజీ ప్రభాకరరావుకు  పోస్టింగ్  ఇచ్చారన్న ఆయన... పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర హోంమంత్రికి ఐజీ ప్రభాకరరావుపై ఫిర్యాదు చేస్తానన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల సహా‌..  రాష్ట్రంలోని ముఖ్య నాయకల  ఫోన్లను టీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాక్ చేస్తుందని హ్యాకర్లను ఉపయోగిస్తూ.. అంతర్జాతీయ నేరానికి పాల్పడుతోన్న కేసీఆర్ భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: