దేశంలో వ్యాక్సినేష‌న్ ప్రారంభించి చాలా కాలం అవుతున్నా ప్ర‌జ‌లు మాత్రం వ్యాక్సిన్ లు వేసుకునేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేదు. దాంతో వ్యాక్సిన్ లు వేసుకోక‌పోతే కొన్ని ప్రాంతాల్లో రేష‌న్ క‌ట్ అంటూ వార్త‌లు పుట్టుకొస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే నిజామాబాద్ లోనూ అలాంటి పుకార్లే పుట్టుకొచ్చాయి. క‌రోనా టీకా తీసుకోక‌పోతే రేష‌న్ బంద్ అంటూ పుకార్లు సృష్టించారు. దాంతో ఎక్క‌డ రేష‌న్  బంద్ అవుతుందోన‌ని ప్ర‌జ‌లు భ‌యంతో టీకాలు తీసుకునేందుకు ప‌రుగులు తీస్తున్నారు. 

ఒక్క‌సారిగా ప్ర‌జ‌లు టీకాల కోసం పోటెత్త‌డంతో ఉద‌యం నుండి వ్యాక్సిన్ కేంద్రాల వ‌ద్ద ప్ర‌జ‌లు బారులు తీరుతున్నారు. దాదాపు 700 మంది టీకాల కోసం రావ‌డంతో వ్యాక్సిన్ కేంద్రాల వ‌ద్ద తోపులాట జ‌రుగుతోంది.దాంతో 500 మందికి వ్యాక్సిన్ లు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.ఇక వ్యాక్సిన్ సెంట‌ర్ల వ‌ద్ద జ‌నాలు బారులు తీరినా...ప్ర‌జ‌లు మాత్రం టీకాల కోసం వ‌స్తున్నార‌ని ఇది మంచిదే అని అధికారులు భావిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: