ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలోని మొదటి పాటయిన టైటిల్ సాంగ్ విడుదలైంది, ఇరగదీసే ఈడి ఫైర్ సల్లగుండా.. ఖాకీ డ్రెస్ పక్కనపెడితే వీడే పెద్ద గుండా అంటూ పాట మొదలు పెట్టిన రామజోగయ్య శాస్త్రి రకరకాల పదప్రయోగాలు చేసి మరీ ముగించాడు. అయితే ఈ విషయంలో ఆయన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. డానికి కారణం ఆయన పోలీసులు అంటేనే మనుషులను ఇరగదీసే వారు అన్నట్టు రాయడమే. ఈ విషయం మీద DCP ఈస్ట్ జోన్, హైదరాబాద్ IPS అధికారి రమేష్ సంచలన వ్యాఖలు చేశారు. ఆయన కృతజ్ఞతగా, తెలంగాణా పోలీసులు పీపుల్ ఫ్రెండ్లీ పోలీసులు, మనం కాపాడటానికి జీతం పొందిన వారి ఎముకలను మేము విరగ్గొట్టం, ఆశ్చర్యకరంగా, రామజోగయ్య శాస్త్రి ఒక పోలీసు ధైర్యాన్ని వివరించడానికి తెలుగులో తగినంత పదాలు మీకు దొరకలేదా? పాటలో సేవ గురించి ఎక్కడా ప్రస్తావించలేదని అంటూ ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: