నిర్మల్ జిల్లాలో 50 మంది గ్రామస్తులు చికెన్ తిని అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జిల్లాలోని కడెం మండలం రాని గూడ గ్రామపంచాయతీ పరిధిలో మొర్రిపేట లో చోటుచేసుకుంది. ఈ నెల ఆరవ తేదీన గ్రామస్తులంతా దండారి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరూ కలిసి ఒకే చోట సహపంక్తి భోజనాలు చేశారు. అయితే మరుసటి రోజు నుండి ఒక్కొక్కరు వాంతులు విరేచనాలతో అస్వస్థత గురయ్యారు.

ఈ ఘటనపై స్థానిక వైద్యాధికారులకు సమాచారం అందడంతో మంగళవారం గ్రామానికి చేరుకున్నారు. బాధితులందరికీ వైద్యాధికారులు చికిత్స అందించారు. అయితే ప్రస్తుతం గ్రామస్తులు అంతా క్షేమంగా ఉన్నారని వైద్య అధికారులు చెప్పారు. వేడుకలో వడ్డించిన చికెన్ కలుషితం అవడం వల్లనే గ్రామస్తులంతా అస్వస్థతకు గురయ్యారని వైద్య అధికారులు చెబుతున్నారు. ఇక గ్రామం లో ఒక్కొక్కరుగా అస్వస్థత కు గురవ్వడం ఆందోళన కు గురి చేసింది. అంతే కాకుండా ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: