ఈనెల (నవంబర్) 26న రాజ్యాంగ దినోత్సవాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రకటన చేసారు. రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ఈనెల 26 న ఉదయం 11 గం.లకు సెంట్రల్ హాల్‌ లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ప్రారంభించనున్నట్లు వెల్లడించిన మంత్రి... కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా.. 26 న రాజ్యాంగ పీఠికను చదవడానికి ప్రజలంతా హాజరు కావాలని కోరారు ఆయన.

రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో సామాన్య పౌరులంతా పాలు పంచుకునేందుకు గాను.. ప్రత్యేకంగా రెండు పోర్టల్‌లను రూపొందించింది పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇంగ్లీష్‌తో సహా.... రాజ్యాంగంలో గుర్తించిన 23 భాషలలో రాజ్యాంగ ప్రవేశిక పఠనం కోసం ఒక పోర్టల్‌ను అభివృద్ది చేసింది కేంద్ర ప్రభుత్వం. రాజ్యాంగంపై ఆన్‌లైన్ క్విజ్ నిర్వహణ కోసం రెండవ పోర్టల్‌ ను కేంద్రం ప్రారంభించింది అని కేంద్ర మంత్రి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp