తెలంగాణ‌లో నిర్వ‌హించిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌లో టీఆర్ఎస్ ఘ‌న విజ‌యం సాధించింద‌ని క‌రీంన‌గ‌ర్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత బోయినిప‌ల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ఇవాళ మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల‌కు.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల క్రాస్ ఓటింగ్ పై ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ కూడా టీఆర్ఎస్ ఓట్లు క్రాస్ కాలేద‌ని వినోద్ కుమార్ స్ప‌ష్టం చేసారు.  రాజ్యాంగంలో మొద‌టి పేజీలో ఉన్న‌ది. భార‌త్ యూనియ‌న్ ఆఫ్ స్టేట్  రాసి ఉంది. అది మ‌రిచి పోయి వాళ్లు ప్రాంతీయ రాజ‌కీయ పార్టీల‌పై దాడి చేయాల‌ని భావిస్తున్నారు.
 
ప్రాంతాయ పార్టీల శ‌క్తిని త‌క్కువ అంచెనా వేయ‌కండి.  స్వాతంత్రం వ‌చ్చిన త‌రువాత గ‌ట్టి పునాదులు వేయ‌బ‌డ్డాయి. సీబీఎస్ఈ ప‌రీక్ష‌లో కొత్త యువ‌త‌కు స్త్రీలు చ‌దువుకోవ‌డం వ‌ల్ల కుటుంబ వ్య‌వ‌స్థ చిన్న‌భిన్న‌మ‌వుతుంద‌ని..  పేర్కొంటున్నారు. స్త్రీల మూలంగా వైరుధ్యం ఏర్ప‌డుతున్నాయ‌ట‌. బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత స్త్రీల‌ను కించ‌ప‌రిచారు. తాలిబ‌న్ల‌కు బీజేపీకి పెద్ద తేడా లేదు అని వినోద్ కుమార్ స్ప‌ష్టం చేసారు. అప్గ‌నిస్తాన్‌లో తాలిబ‌న్లు మ‌హిల‌ల‌ను చ‌దువుకోనివ్వ‌డం లేద‌ని.. ఇక్క‌డ చ‌దువుకున్న స్త్రీల ప‌ట్ల ఇంత విద్వేశ‌మా అని పేర్కొన్నారు వినోద్ కుమార్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: