శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు ఇది నిజంగా శుభవార్తే.. కరోనా కాస్త అదుపులోకి రావడంతో సర్వ దర్శనం భక్తుల సంఖ్య పెంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి ఆఫ్ లైన్ ద్వారా తిరుపతిలో టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇలా  10 వేల సర్వదర్శనం టికెట్లు జారీ చేయబోతున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం  ఈవో జవహర్ రెడ్డి ప్రకటించారు. కరెంట్ బుకింగ్ ద్వారా రోజూ 10 వేల టికెట్లు జారీ చేయబోతున్నట్టు జవహర్ రెడ్డి వివరించారు.

శ్రీవారి సర్వదర్శనం టికెట్ల సంఖ్యను పెంచబోతున్నట్టు ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆన్‌ లైన్‌ ద్వారా 10 వేల టికెట్లు జారీ చేశామని ఈ వో జవహర్ రెడ్డి తెలిపారు. అలాగే ఆర్జిత సేవల పునరుద్ధరణపైనా ఈ వో స్పందించారు. దీనిపై పాలక మండలిలో నిర్ణయం తీసుకున్నట్లు ఈవో చెబుతున్నారు. అలాగే ప్రాణదాన ట్రస్టుకు కోటి  రూపాయలు విరాళం ఇస్తే.. ఉదయాస్తమాన సేవా టికెట్లు అందిస్తామని తెలిపారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్ సైట్ ద్వారా కూడా  ఉదయాస్తమాన టికెట్లు బుక్ చేసుకునేందుకు త్వరలో వెబ్‌ పోర్టల్‌ను తీసుకొస్తున్నామని ఈ వో వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: