ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇలా చెప్పేందుకు కొన్ని గణాంకాల సాయం తీసుకోవాలి. అనేక లెక్కలు చూడాలి. ప్రజల జీవన ప్రమాణాలు చూడాలి. అయితే.. ఇటీవల ఇండియా ఓ దారుణమైన రికార్డు నమోదు చేస్తోంది. రోడ్డు ప్రమాదాల విషయంలో.. వాటిలో చనిపోయే వారి సంఖ్యలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు.


స్విట్జర్లాండ్ లోని జెనీవాలో అంతర్జాతీయ రోడ్డు సమాఖ్య విడుదల చేసిన గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాదాలు, గాయపడుతున్నవారి సంఖ్యలో భారత్‌  ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందట. ఈ విషయాన్ని గడ్కరీ రాజ్యసభలోనే తెలిపారు. 2020లో జరిగిన ప్రమాదాల్లో చనిపోయినవారిలో 18నుంచి 45ఏళ్లలోపువారే  70శాతం ఉన్నారట. దేశంలోని  ఐదు ఎక్స్‌ ప్రెస్‌వేలు సహా  22గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారుల నిర్మాణం జరుగుతున్నట్లు గడ్కరీ ప్రకటించారు. వాహనాల రిజిస్ట్రేషన్‌, చాసిస్‌ నెంబరు ఆధారంగా వాహనాలకు ఫాస్ట్‌ ట్యాగ్‌ జారీ చేస్తున్నారట. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులు 4. 95 కోట్ల ఫాస్ట్‌ట్యాగ్‌లు జారీచేశాయట. అలాగే టోల్‌ఫ్లాజాల వద్ద ఫాస్ట్‌ట్యాగ్‌ల ప్రవేశం 96.5శాతానికి పెరిగిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: