ఉక్రెయిన్‌ పై యుద్ధం చేస్తున్న రష్యా... ఆ యుద్దాన్ని అనేక రూపాల్లో కొనసాగిస్తోంది. సైన్యం మాత్రమే కాదు.. టెక్నికల్ సైన్యం కూడా యుద్ధంలో పాల్గొంటోంది. ఉక్రెయిన్ సహా పలు దేశాలకు చెందిన సంస్థలపై రష్యా సైబర్ దాడులకు పాల్పడుతోంది. అయితే.. ఈ సైబర్ దాడులను తాము అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ తెలిపింది. రష్యా మిలిటరీ గూఢచారుల బృందం... ఉక్రెయిన్ కు చెందిన ప్రభుత్వ సంస్థలు, విదేశీ విధానాన్ని ఖరారు చేసే అమెరికా, ఈయూకు చెందిన మేథోమథన సంస్థలపై సైబర్ దాడులు చేసిందట. రష్యా టార్గెట్ చేసిన సంస్థల పేర్లు వెల్లడించని మైక్రోసాఫ్ట్.. ఇందుకు 7ఇంటర్నెట్ డొమైన్లను రష్యా ఉపయోగించినట్లు మైక్రోసాఫ్ట్  చెబుతోంది. అయితే.. రష్యా సైబర్  దాడులను తాము గుర్తించి అడ్డుకున్న విషయాన్ని మైక్రోసాఫ్ట్ ఉక్రెయిన్ ప్రభుత్వానికి తెలిపింది. రష్యా టీమ్ ఉపయోగించిన ఏడు ఇంటర్నెట్  డొమైన్లను స్వాధీనం చేసుకునేందుకు కోర్టు నుంచి మైక్రోసాఫ్ట్ ఉత్తర్వులు కూడా పొందిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: