దావోస్ లో జరుగుతున్న  ప్రపంచ ఆర్ధిక సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అనేక మంది పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతున్నారు.  నిన్న ఆయన దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్, టెక్ మహీంద్రా ఎండీ, సీఈఓ సీపీ గుర్నానీతో భేటీ అయ్యారు. నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి కోరినట్టు టెక్ మహీంద్రా, దస్సాల్ట్ సిస్టమ్స్ ప్రతినిధులు మీడియాకు తెలిపారు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా విశాఖను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్ కోరారని టెక్ మహీంద్రా సీఈఓ గుర్నానీ తెలిపారు.  నైపుణ్యాభివృద్ధి, హైఎండ్ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో ఆంధ్రా యూనివర్సిటీతో కలిసి పాఠ్యప్రణాళిక సిద్ధం చేస్తామని గుర్నానీ తెలిపారు. కొత్త తరహా ఇంధనాల రూపకల్పనలోనూ దస్సాల్ట్ పనిచేస్తోందని దస్సాల్ట్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెల్లడించారు. ఏపీ  పెవిలియన్ లో స్విస్ పార్లమెంటు ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: