అమెరికా.. అవకాశాల స్వర్గం.. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి అక్కడకు వెళ్లి స్థిరపడేందుకు అనేక దేశాల వారు ప్రయత్నిస్తారు. అయితే.. మన ఇండియా నుంచి పెద్ద సంఖ్యలో అమెరికాలో స్థిరపడ్డారు. అలా అమెరికా పౌరసత్వం పొందిన వారిలో ఇండియన్లే ఎక్కువని తాజా లెక్కలు చెబుతున్నాయి. అమెరికాలో 2022 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కొత్తగా పౌరసత్వం పొందినవారిలో తొలి 5 దేశాల్లో భారత్‌ ది సెకండ్ ప్లేస్.. ఈ త్రైమాసికంలో మొత్తం 1,97,148 మందికి అమెరికా పౌరసత్వం ఇచ్చింది.


వీరిలో ఎక్కువగా మెక్సికో నుంచి 24,508 మందికి అమెరికా పౌరసత్వం వచ్చింది. ఇక సెకండ్ ప్లేస్ మనదే.. 12,928 మంది ఇండియన్స్‌కు అమెరికా పౌరసత్వం వచ్చింది. ఆ తర్వాత ప్లేస్‌  ఫిలిప్పీన్స్‌ది.. ఆ తర్వాత వరుసలో  క్యూబా, డొమినికన్‌ రిపబ్లిక్‌ ఉన్నాయి. గతేడాది కూడా మెక్సికో, భారత్‌లే ముందంజలో ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: