ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ ముందు విచారణకు హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. సోనియాపై ఈడీ కేసును వ్యతిరేకిస్తూ నిరసనలకు కాంగ్రెస్‌ నిర్ణయించింది. ప్రత్యేకించి దిల్లీలో ఆందోళనలో చేయనున్నారు. ఏఐసీసీ కార్యాలయం నుంచి ఈడీ ఆఫీస్‌కు కాంగ్రెస్‌ అగ్రనేతలు ప్రదర్శనగా వెళ్లనున్నారు. బీజేపీ నియంతృత్వ పాలన విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. 


నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియాను ఈడీ విచారించనుంది. వాస్తవానికి సోనియా గత నెలలోనే విచారణకు హాజరుకావాలి. కరోనా కారణంగా సోనియా విచారణకు వెళ్ల లేదు. ఇప్పుడు ఆమె కరోనా నుంచి కోలుకున్నారు. అందుకే సోనియాకి ఈడీ తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. గత నెలలోనే రాహుల్‌ గాంధీని కూడా ఈడీ విచారించింది. రాహుల్ గాంధీను ఐదు రోజుల పాటు ఈడీ విచారించింది. మొత్తం 55 గంటల పాటు రాహుల్ గాంధీని అనేక అంశాలపై ప్రశ్నించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: