కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. తాను అధ్యక్షుడిగా ఉండనని రాహుల్ గాంధీ మొండికేస్తున్నారు. సోనియా గాంధీకి వయస్సు మీదపడింది. అందుకే కొత్త నాయకుడు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ఈ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై ఇప్పుడు మరో కొత్త వివాదం వచ్చింది. ఈ ఎన్నికల్లో  పారదర్శకత ఉండాలని కొందరు ఎంపీలు ఏఐసీసీ  సెంట్రల్ ఎలక్షన్ చీఫ్ మధుసూదన్ మిస్త్రీకి లేఖ రాశారు.


అయితే.. సెప్టెంబర్  ఆరో తేదీన రాసిన ఈ లేఖ ఇప్పుడు ఆలస్యంగా వెలుగుచూసింది. కాంగ్రెస్  చీఫ్  ఎన్నికల ప్రక్రియ గురించి ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాను అభ్యర్థులకు సురక్షితంగా అందించాలని  ఎంపీలు కోరుతున్నారు. లోక్ సభ సభ్యులు శశి థరూర్ , కార్తీ చిదంబరం, ప్రద్యుత్  బోర్దోలోయ్, అబ్దుల్ ఖలేఖ్ ఈ లేఖ రాశారు. ఈ ఎన్నికలకు ఓటర్ల జాబితాను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: