భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో పోటీపడి దోచుకునే కుటుంబ పార్టీలను ప్రజలు ఎన్నుకున్నారని వ్యాఖ్యానించారు. రాయలసీమలో ఉన్న ప్రజాప్రతినిధులు దద్దమ్మలంటూ ఘాటుగా సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ అవినీతి పరిపాలన దించడమే బీజేపీ లక్ష్యం అని సోము వీర్రాజు స్పష్టం చేశారు. లక్ష కోట్ల రూపాయల సంపద ఉన్న రాయలసీమలో సరైన సంకల్పం లేని రాజకీయ వ్యవస్థ ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు.


వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన భాజపా రాయలసీమ సమావేశం సందర్భంగా  సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. రెండు కుటుంబ పార్టీల మూలంగా రాష్ట్రంలో వనరులు దోపిడీకి గురవుతున్నాయని  సోము వీర్రాజు మండిపడ్డారు. ఎన్నికల్లో నెగ్గాలంటే డబ్బును ప్రధానం చేశారని  సోము వీర్రాజు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కడం తప్ప బయటకు వచ్చే పరిస్థితి లేదని  సోము వీర్రాజు ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: