రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు వైస్సార్ చేయూత ఆర్థిక ఆసరా నిస్తుందని ఉప ముఖ్యమంత్రి  బూడి ముత్యాల నాయుడు అన్నారు.  రాష్ట్రంలో చేయూత ద్వారా 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్న 26 లక్షల మంది మహిళలకు  ప్రభుత్వం అందిస్తుందన్నారు.  వీటితో వివిధ వృత్తిలో ద్వారా అభివృద్ధి చెందుతున్నారని అన్నారు.  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  తన సుదీర్ఘ పాదయాత్రలో  మహిళల సమస్యలపై స్పందించిన  జగన్ మోహన్ రెడ్డి అక్కచెల్లెళ్ళును ఆదుకునేందుకు ఈ చేయూత పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు.


అనకాపల్లి జిల్లా మాడుగులలో మూడో విడత చేయూత సంబరాలు స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజి గ్రౌండ్ లో నిర్వహించారు. అనంతరం 5,518 మందికి రూ.10 కోట్ల 35 లక్షల చెక్కును మహిళలకు అందజేశారు. తర్వాత ప్రభుత్వ కళాశాలలో నాడు- నేడులో రూ.కోటి 20 లక్షలతో చేపట్టనున్న పనులకు ఉప ముఖ్యమంత్రి బూడి, అనకాపల్లి ఎం.పీ సత్యవతి భూమి పూజ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: