రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. రష్యా తనకు పట్టు ఉన్న ఇంధనం అంశాన్ని ఇతర దేశాలపై ఆధిపత్యానికి వినియోగిస్తోంది. దీంతో రష్యా ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఉక్రెయిన్  అధ్యక్షుడు జెలెన్ స్కీ అంటున్నారు. ఇంధన వ్యవస్థలపై దాడుల తర్వాత తమ దేశంలోని 45లక్షల మంది తాత్కాలికంగా అంధకారంలో మగ్గుతున్నట్లు ఉక్రెయిన్  అధ్యక్షుడు జెలెన్ స్కీ చెప్పారు.

కొన్నివారాల క్రితం ఉక్రెయిన్ లోని విద్యుత్తు వ్యవస్థలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో రష్యా విరుచుకుపడింది. ఇటీవల యుద్ధభూమిలో వరుస ఓటముల తర్వాత మాస్కో ఈ పని చేసింది. ఉక్రెయిన్ లోని వివిధ నగరాల విద్యుత్తు వ్యవస్థలపై రష్యా దాడులకు దిగింది. గత నెలలో ఉక్రెయిన్‌లోని మూడో అతిపెద్ద విద్యుత్తు కేంద్రాన్ని రష్యా నాశనం చేసింది. ఇది ఇంధన ఉగ్రవాదమేనని జెలెన్ స్కీ ఆరోపించారు. అయితే ఎలాగైనా ఉక్రెయిన్‌ను లొంగదీసుకోవాలనుకుంటున్న రష్యా అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: