తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై టీటీడీ విభాగాధిపతులతో ఈఓ ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం ఏర్పాట్లను ఈఓ ధర్మారెడ్డి మీడియా కు వివరించారు. జనవరి 2 న వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని.. జనవరి 11 వరకు ద్వారాలు తెరిచి ఉంటాయని ఈఓ ధర్మారెడ్డి వివరించారు.

వైకుంఠ ఏకాదశికి టికెట్లు కలిగి ఉన్న భక్తులకే దర్శనం ఉంటుందని ఈఓ ధర్మారెడ్డి  తెలిపారు. 300 ప్రత్యేక దర్శన టిక్కెట్లను రోజుకు 25 వేలు భక్తులకు  జారీ చేస్తామన్న ఈఓ ధర్మారెడ్డి .. తిరుపతి లో 9 ప్రాంతాల్లో సర్వ దర్శన టికెట్లు జారీ చేస్తామని వివరించారు. రోజుకు 50 వేలు చొప్పున సర్వ దర్శన టోకెన్లు అందించనున్నామని ఈఓ ధర్మారెడ్డి  తెలిపారు. తిరుమలలో ఉన్న స్థానికులకు కౌస్తుభం వద్ద జారీ చేస్తారు. 7.5 లక్షల మందికి సర్వ దర్శన ద్వారా వైకుంఠ ద్వారా దర్శనం కలుగుతుంది. 10 రోజుల పాటు శ్రీవారి ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తామని ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవాణి ట్రస్టు దాతలకు ఆన్ లైన్ ద్వారా టికెట్లు జారీ చేస్తారు. మహాలఘు ద్వారానే అందరికీ స్వామివారి దర్శనం ఉంటుందని ఈఓ ధర్మారెడ్డి  తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: