తెలంగాణలో గ్రూప్‌-4 ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియలో అస్పష్టత నెలకొంది. లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నఈ ఉద్యోగాల ప్రక్రియను సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. దీన్ని ఈనెల 30కి వాయిదా వేసినట్లు టీఎస్‌పీఎస్సీ  ప్రకటించింది. శుక్రవారం దరఖాస్తుల కోసం వెబ్‌సైట్‌ చూసిన అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ  వాయిదా నోటీసు కనిపించింది. గ్రూప్-4 దరఖాస్తులు ఈనెల 30 నుంచి 2023 జనవరి 13 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.


సాంకేతిక కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. అయితే.. మూడు వారాల ముందుగానే గ్రూప్ ప్రకటన జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ  శుక్రవారం ఇలా దరఖాస్తుదాలకు షాక్ ఇచ్చింది. దీంతో లక్షలాది మంది ఎదురుచూస్తున్న గ్రూప్‌-4 ఉద్యోగాల దరఖాస్తుల ప్రక్రియపై గందరగోళం నెలకొన్నట్టయింది. అయితే జిల్లాల నుంచి సమగ్ర ప్రతిపాదనలు రాకపోవడం వల్లే ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: