ప్రైవేట్ ఆస్తుల సేకరణను సాధ్యమయ్యేంత వరకు తగ్గించే విధంగా ఎయిర్ పోర్టు మెట్రో అలైన్ మెంట్ ఖరారు చేయాలని హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెబుతున్నారు.  ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్‌ను తన ఇంజినీర్లతో కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి  పరిశీలించారు. స్టేషన్ల యాక్సెస్ పాయింట్లు కొత్త సైకిల్ ట్రాక్‌కు అనుగుణంగా ఉండాలని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సూచించారు. పర్యావరణహితంగా స్టేషన్‌లను చేరుకోవడానికి ఈ కొత్త సైకిల్ ట్రాక్ ఉపయోగపడుతుందని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.


స్టేషన్లను సులువుగా చేరుకోవడం కోసం ఓఆర్ఆర్ అండర్‌పాస్‌లను ఉపయోగించేందుకు వీలుగా స్టేషన్లు నిర్ణయించాలని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. భవిష్యత్తులో అదనపు స్టేషన్‌ల నిర్మాణం కోసం కొన్ని గుర్తించబడిన ప్రదేశాలలో మెట్రో వయాడక్ట్‌ను ప్లాన్ చేయాలని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. స్కైవాక్‌లు, ఇతర పాదచారుల సౌకర్యాలు స్టేషన్ ప్లానింగ్‌లో అంతర్భాగంగా ఉండాలన్న ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మెట్రో పిల్లర్లు నానక్ రామ్ గూడ జంక్షన్ నుండి అప్ప వరకు విస్తరించిన సర్వీస్ రోడ్డు సెంట్రల్ మీడియన్‌లో ఉండాలన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: