బీజేపీ ఓబీసి అంశాన్ని రాజకీయంగా వాడుకుంటోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతురావు ఆరోపించారు. అదాని వ్యవహారం చర్చకు రాకుండా ప్రజల దృష్టి మరల్చేందుకు ఓబీసీల అంశాన్ని తెరపైకి తెస్తోందని వీహెచ్‌ ద్వజమెత్తారు. రాహుల్ గాంధీ ఓబీసీలను కించ పరుస్తూ మాట్లాడారని, ఆయన ఓబీసీలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ నాయకులు కొత్త వాదనను అందుకున్నారని వీహెచ్‌ విమర్శించారు. ఎందుకు క్షమాపణలు చెప్పాలన్నవిహెచ్‌ అధానిపై పార్లమెంట్‌లో ప్రశ్నించినందుకా..? అని నిలదీశారు.


ఏప్రిల్ 1వ తేదీన అన్ని పార్టీలతో సోమజిగూడ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వీహెచ్‌ తెలిపారు. ఇందులో రాహుల్ గాంధీ ఓబీసీలను ఎక్కడ కించ పరిచారన్నఅంశంతోపాటు ఓబీసీలకు గత ప్రభుత్వాలు ఏ చేశాయి...ఇప్పుడు గడిచిన తొమ్మిదేళ్ళగా బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందన్న అంశంపై కూడా చర్చిస్తామని వీహెచ్‌ పేర్కొన్నారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలతోపాటు ఓబీసీ విద్యార్థులు, మేధావులు
పాల్గొంటారని హనుమంతురావు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP