ఇటీవల బీజేపీ నుంచి టీడీపీకీ వచ్చిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కొడుకు కోడెల శివరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. పల్నాడులో టిడిపి జెండా ఎగరటానికి కారణంగా కోడెల శివప్రసాద్ అన్న కోడెల శివరాం.. ఆయన జీవించినంతకాలం టిడిపిని కుటుంబం అనుకున్నారన్నారు. కానీ ఆయన చనిపోయాక తమపై కేసులు పెట్టారని.. వాటిలో ఇప్పటికి ఒక్కటి నిరూపితం కాలేదు, ఒక్కదాంట్లో కూడా ఛార్జిషీట్ వేయలేదని కోడెల శివరాం చెప్పారు.


టిడిపి కార్యకర్తల కోసం మేం కేసులు ఎదుర్కొన్నామని.. కానీ ఇటీవలి పరిణామాలు బాధ  కలిగిస్తున్నాయని.. కోడెల కుటుంబంపై పార్టీ నేతల్లోనే వివక్ష ఎందుకని కోడెల శివరాం ప్రశ్నించారు. మంత్రి గౌతంరెడ్డి చనిపోతే ఆయన కుటుంబసభ్యులపై పోటీపెట్టలేదని.. కానీ కోడెల కుటుంబంపై మాత్రం వివక్ష చూపిస్తున్నారని అన్నారు. చంద్రబాబు గారిని కలిసి మా గోడు వెళ్లబోసుకుందామన్నా కుదరటం లేదని.. జిల్లా నేతల్ని కలిసినా ప్రయోజనం లేదని.. కోడెల గారి పేరు మీద అవార్డులు పెడితే పార్టీ నేతల సహకారం కొరవడిందని కోడెల శివరాం విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: