గంధం లేదా చందనం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మంచి గంధంలో చర్మానికి మేలు చేసే సుగుణాలెన్నో ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మొటిమల్ని అదుపులో ఉంచడం, చర్మఛాయను మెరుగుపరచడం, ముఖంపై మ‌చ్చ‌ల‌ను తొలిగించ‌డం వంటి మేలైన ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. అందుకే చాలా రకాల సబ్బులు గంధాన్ని తమ ఉత్పత్తుల్లో వాడతాయి. ఇది ఏ రకమైన చర్మం కలిగినవారికైనా సమర్థవంతంగా పనిచేస్తుంది. అయితే దీనిని ఎలా ఉప‌యోగించాలో చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. అలాంటి ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ పాటిస్తే స‌రి. 

 

అందుకు ముందుగా.. ముఖంపై మొటిమలకు సంబంధించిన మచ్చలు ఇబ్బందిపెడుతుంటే గంధం పొడిలో ఒక స్పూన్‌ పాలు, రెండు చుక్కల తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి, మొటిమ‌లు ఉన్న ప్ర‌దేశాల్లో అప్లై చేయాలి. అరగంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే గంధపు నూనె, ఆలివ్‌ ఆయిల్‌ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. పావు గంట పాటు మర్దన చేసి.. ఆ త‌ర్వాత‌ చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. 

 

అదేవిధంగా,  పాలు, గంధాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఓ పావు గంట త‌ర్వాత‌ చల్లని నీటితో కడగాలి. ఇలా వానానిరి రెండు చేస్తే ముఖం కాంతివంతంగా, మెరిసిపోయేలా చేస్తుంది. అలాగే నల్లమచ్చలు ఉన్నవారు గంధం పొడిలో స్పూన్‌ పసుపు, కర్పూరం కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారినికి రెండు సార్లు చేస్తే మంచి ఫ‌లితం పొందొచ్చు. ఇక బ్లాక్‌హెడ్స్‌, యాక్నే వంటి సమస్యలు కొందరిని వేధిస్తుంటాయి. అలాంటి వారికి కూడా ఈ ప్యాక్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

  

మరింత సమాచారం తెలుసుకోండి: