చర్మానికి ఎలాంటి హాని జరగకుండా పువ్వులా వికసించాలంటే హైడ్రేషన్ అనేది చాలా ముఖ్యం. మన చర్మం ఎప్పుడూ కూడా పొడిబారి పోకుండా ఎప్పటికప్పుడు హైడ్రేట్ గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా చేస్తే చర్మం పువ్వులా వికసిస్తుంది...ఇక చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌ని రెగ్యులర్ గా వాడడం వల్ల స్కిన్ కి నేచురల్ గ్లో అనేది చాలా ఈజీగా పెరుగుతుంది.ఇక డ్రై స్కిన్ తో బాధ పడేవాళ్లకి  క్రీం బేస్డ్ మాయిశ్చరైజర్ ఇంకా ఆయిల్ ఉండే వాటిని వాడడం మంచిది. ఆయిల్ ఇంకా కాంబినేషన్ స్కిన్ అయితే జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ వాడడం ఎంతో మంచిది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మంచి సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా వాడాలి. అలా సన్ స్క్రీన్ లోషన్ వాడుకోవడం అనేది చర్మానికి చాలా మంచిది.సూర్య కిరణాల కారణంగా స్కిన్ పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్‌గా సన్ స్క్రీన్ ని వాడటం మంచిది. 

ఎప్పుడూ కూడా సన్ స్క్రీన్ వాడేటప్పుడు ఎస్పిఎఫ్ 30 కంటే ఎక్కువ ఉండే వాటిని వాడటం మంచిది. బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఉన్నా సరే సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం చాలా మంచిది.ఇలా రోజు రెగ్యులర్ గా మీరు సన్ స్క్రీన్ లోషన్ ని వాడడం వల్ల మీ చర్మం అందంగా, షైనీగా ఇంకా పువ్వులా ఎప్పటికి వికసిస్తూ ఉంటుంది.ఇక ప్రతి రోజు కూడా రెగ్యులర్ గా డెడ్ స్కిన్ ని తొలగించడం చాలా అంటే చాలా ముఖ్యం. డెర్మటాలజిస్ట్లు ఈ టెక్నిక్‌ని తప్పక పాటించాలి అని ఖచ్చితంగా చెప్తున్నారు. ఇలా ప్రతి రోజు కూడా చేయడం వల్ల చర్మం మరింత అందంగా బ్రైట్‌గా స్కిన్ కనబడుతుంది. ఇంకా ఏదైనా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ని మీ ముఖంపై ఉపయోగిస్తే మీ ముఖం కాంతిలా మెరుస్తూ పువ్వులా వికసించడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: