ఓట్స్‌ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇవి కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సంరక్షణకు కూడా చాలా రకాలుగా మేలు చేస్తాయి. ఎందుకంటే ఓట్స్‌లో కావాల్సినన్ని ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరానికి, చర్మానికి మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ ఇ కూడా ఉంది. ఇది చర్మ ఆరోగ్య ప్రయోజనాలకు అతి ముఖ్యమైన విటమిన్‌. ఇతర తృణధాన్యాలతో పోలిస్తే ఓట్స్‌ అధిక అమైనో ఆమ్లం, సిలికా కంటెంట్‌ను కలిగి ఉంటుంది. ఓట్స్‌లో ఉండే విటమిన్ ఇ ఒక యాంటీఆక్సిడెంట్. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి రక్షిస్తుంది. ఓట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది పొడిబారుదనం, దురద చర్మాన్ని దూరంగా ఉంచుతుంది. మీ ముఖంపై ఉన్న ముడతలను చాలా ఈజీగా తొలగించేందుకు ఓట్ మీల్ ఫేస్ ప్యాక్స్‌ చర్మ సమస్యలను చాలా ఈజీగా తగ్గిస్తుంది.ఒక చిన్న బొప్పాయి ముక్క, రెండు టేబుల్ స్పూన్ల గ్రౌండ్ ఓట్స్, కొంచెం నీరు ఇంకా ఒక టీస్పూన్ బాదం నూనె వేసి ప్యాక్ తయారు చేయండి.


దీన్ని మీ ముఖానికి అప్లై చేసి ఒక 15 నిమిషాల బాగా ఆరనివ్వండి.. ఆ తర్వాత శుభ్రంగా కడిగేయండి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల మచ్చలు చాలా సింపుల్ గా తొలగిపోయి చర్మానికి మంచి మెరుపు వస్తుంది.అలాగే ఒక బౌల్లో రెండు టేబుల్‌ స్పూన్ల ఓట్స్‌ తీసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న కీర దోసకాయ ముక్కలు, పుదీనా ఆకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను వేరు చేసుకోవాలి. దీనికి ముందుగా తీసుకున్న ఓట్స్ పౌడర్ ను వేసుకుని దానిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు కాస్త మందంగా అప్లై చేసుకుని ఒక అరగంటపాటు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి.. క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉంటే.. మీ ముఖం  సహజంగానే కాంతివంతంగా మెరిసిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఓట్స్ తో ఈ టిప్ ట్రై చెయ్యండి. చాలా అందంగా ఇంకా అలాగే ఎంతో కాంతివంతంగా మెరుస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: